KGF2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన కే జి ఎఫ్2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో నేరుగా విడుదలైన సినిమాలను సైతం పక్కకు నెట్టి కేజిఎఫ్ కి నీరాజనాలు పట్టారు బాలీవుడ్ ప్రేక్షకులు. దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీలో కేజీఎఫ్2 మూడవ స్థానంలో నిలిచింది. థియేటర్ లో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీలో సందడి చేసినట్టే ఈ సినిమా కూడా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే అభిమానుల ఎదురు చూపులకు తెర తీసేసి కేజిఎఫ్2 సినిమాని ఓటీటీలో విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కేజిఎఫ్2 సినిమాని ఓటీటీలో హెచ్ డి క్వాలిటి లో విడుదల చేశారు. కే జి ఎఫ్2 సినిమాని తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా అన్ని భాషలలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ రిలీజ్ చేసింది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాని ఓటీటీ లో చూడాలంటే అభిమానులకు ఒక మెలిక పెట్టింది.
కేజీఎఫ్ 2 సినిమాని ఓటీటీ లో చూడాలంటే డబ్బు కట్టాల్సిందే…..

ఓటీటీ లో పే ఫర్ వ్యూ పద్దతి ఇంతకు ముందు కూడా వుంది. అయితే ఈ పద్ధతి ఓటీటీ లో నేరుగా విడుదల ఆయన సినిమాలకు మాత్రమే వర్తించేది. థియేటర్లో సినిమా అయిన సినిమాలు తిరిగి ఓటీటీ లో విడుదల చేస్తే సబ్స్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది, మనం సినిమాని చూడవచ్చు దానికి పే ఫర్ వ్యూ పద్దతి అవసరం లేదు. తాజాగా మే 20 న ఓటీటీ లో విడుదల అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కి జీ5 ఇదే ప్రకటన చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ లో విడుదల అయిన మొదటి 10 రోజులు ఈ పే ఫర్ వ్యూ పద్ధతి ఉంటుంది. తరువాత ఉచితంగా చూడవచ్చు. ఇపుడు అదే బాటలో కేజీఫ్ 2 సినిమా కూడా పే ఫర్ వ్యూ పద్దతి అనుసరిస్తోంది. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వీడియో లో చూడాలంటే రూ.199 చెల్లించాలట. మొదట మే 27న కేజీఫ్ 2 సినిమా ఓటీటీ విడుదల అని వార్తలు వచ్చినప్పటికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఎటువంటి సమాచారం లేకుండా ఓటీటీ లో విడుదల చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.































