KGF2 missed that magic : కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రపంచవ్యాప్తంగా గురువారం విడుదలయి మంచి ఓపెనింగ్స్ రాబట్టుకొంది. బాలీవుడ్ లో భారీ ఓపెనింగ్స్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ కి మంచి షాక్ ఇచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోను కేజీఎఫ్ 2 క్రేజ్ మాములుగా లేదు. యష్ కు తెలుగు స్టేట్స్ లో ఎంత క్రేజ్ ఉందొ సినిమా ఓపెనింగ్స్ తో తెలిసిపోయింది. ఇక రాజమౌళి బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసే పనిలో వుంది కేజీఎఫ్ 2.

అనంత్ నాగ్ ను మిస్ అవుతున్న ప్రేక్షకులు :
కేజీఎఫ్ మొదటిభాగం లో కథను ఆనంద్ వాసిరాజు అనే పాత్రతో చెప్పిస్తారు. ఆయన పాత్ర పరిమితంగా ఉన్నా కేజీఎఫ్ లో ఆయన కథ చెప్పే తీరుకు అందరు కనెక్ట్ అవుతారు. అయితే కేజీఎఫ్ 2 లో ఆ పాత్రలో ఆనంద్ వాసిరాజు కొడుకు విజయేంద్ర వాసిరాజు పాత్రలో ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. అయితే ఆనంద్ వాసిరాజు గా అనంత నాగ్ గారు కథ చెప్పే విధానం అందరిని అకట్టుకుంది.

ఆయన నటనతో పోలిస్తే ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ తేలిపోయారానే చెప్పాలి. ప్రకాష్ రాజ్ మంచి నటుడే కావొచ్చు కానీ అనంత్ నాగ్ గారిని ప్రేక్షకులు ఆల్రెడీ ఓన్ చేసుకోవడం వల్ల ప్రకాష్ రాజ్ నచ్చలేదు. ఇక అందుకే కేజీఎఫ్ 2 లోకూడా అనంత్ నాగ్ నటించుంటే కేజీఎఫ్ 2 మరో రేంజ్ లో ఉండేదని ప్రేక్షకులకు అభిప్రాయం.


































