Kiara Advani And Varun Dhawan : ఏదైనా ఒక సినిమా వస్తే, ఆ సినిమా విడుదలకి ముందు ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో హీరోయిన్లు పాల్గొనడం మామూలే, ఇంకా ఆ సినిమా విజయం సాదిస్తే అపుడు ఇంటర్వ్యూలలో కలసి రావడం, ఫోటో షూట్లు చేస్తూ మీడియకు మ్యాగజైన్ లకు ఫోజులు ఇవ్వడం మామూలుగానే జరుగుతుంది. అయితే ఇంతకు మించి వారి మధ్య ఎక్కువ జరిగితే కొత్త వివాదాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు బాలీవుడ్ నటీ నటులు వరుణ్ ధావన్, కియారా అద్వానీ.

ఫోటోషూట్లో ముద్దు పెడుతూ…
ఇటీవల బాలీవుడ్లో వరుణ్ ధావన్, కియారా జంటగా ‘జుగ్ జుగ్ జియో’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అవ్వడమే కాదు హిట్ టాక్ సొంతం చేసుకుని, అలాగే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంతే కాకుండా స్క్రీన్ మీద వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అయితే సినిమా విజయం సాధించడంతో ఈ జంట సక్సెస్ మీట్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఫోటోషూట్లో పాల్గొన్నారు. వరుణ్, కియారా ఇద్దరూ దగ్గరగా క్లోసప్ లో ఫోటోలకు బాగానే పోజులిస్తున్న సమయంలో వరుణ్ కియారా బుగ్గపై ముద్దు పెట్టేశాడు.

ఇక ఇపుడు ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వివాదానికి తెరలేపింది. బాలీవుడ్లో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కొందరు సినిమా అయిపోయాక కూడా ఈ ముద్దులేంటి? ఇక ఆపండి అని, మరికొందరు వరుణ్ నీకు పెళ్ళి అయింది.. గుర్తుందా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
































