Kirrak RP : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. మీడియా పబ్లిసిటీతో కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు భాగనే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది.

నెల్లూరు చేపల పులుసుకు ట్రైనింగ్…
జనాల డిమాండ్ కు సరిపడా వండించలేక పోయిన ఆర్పీ కర్రీ పాయింట్ ను తాత్కాలికంగా ముయించాడు. భారీగా జనం క్యూ కట్టడం వల్ల వాళ్లందరికీ సరిపడా వండించలేకపోతున్నామని ప్రెస్ మీట్ పెట్టి మరీ నెల్లూరు మహిళలకు ఆఫర్ ఇచ్చాడు. నెల్లూరు చేపల పులుసు ఎవరైతే బాగా వండుతారో వాళ్ళు చేసి తీసుకువస్తే ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేస్తామంటూ చెప్పడంతో చాలా మంది మహిళలు కిర్రాక్ ఆర్పీకి తమ చేపల పులుసును రుచి చూపించడానికి వస్తున్నారు. రోజుకు రెండు వందల మంది దాకా చేపల పులుసు వండి తీసుకువస్తున్నారు. ఇక వారిలో ఎవరు బాగా చేసారో రుచి చూసి డిసైడ్ చేస్తున్నాడు ఆర్పీ.

నెల్లూరు చేపలతో అక్కడ ఎలా చేపల పులుసు చేస్తారో అలానే వండి తీసుకువస్తున్న వారిలో రుచి నచ్చి అది నిల్వ ఉండే సమయాన్ని బట్టి ఆర్పీ సెలెక్ట్ చేస్తున్నాడు. ఇక అలా సెలెక్ట్ చేసిన వారిని హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ వారి చేత పులుసు పెట్టిస్తానంటూ చెబుతున్నాడు. చాలా మంది ఫోన్ చేసి ఎపుడు రీ ఓపెన్ చేస్తావంటూ అడుగుతున్నారని ఆర్పీ తెలిపాడు. ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రుచి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తినాలని భావిస్తారంటూ చెప్పిన ఆర్పీ రెస్టారెంట్ లో చిన్న చిన్న మార్పులు చేసి వంట గదిలో మార్పులు చేసి నేడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపారు.































