Kirrak RP : సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ నెల్లూరు చేపల పులుసు ఇష్యూలో ఇప్పుడు మళ్ళీ రెస్టారెంట్ ను రీ ఓపెన్ చేసి కిర్రాక్ ఆర్పీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. కూకట్ పల్లి హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టాడు ఆర్పీ. మీడియా పబ్లిసిటీతో నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో కట్టెల పొయ్యి మీద వండిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. జనం ఎగబడ్డారు, ఏకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేంతలా కిర్రాక్ కర్రీ పాయింట్ కి డిమాండ్ పెరిగింది.

మళ్ళీ తెరిచిన చేపల పులుసు హోటల్…
జనం తాకిడి తట్టుకోలేక వస్తున్న జనంకు సరిపడా చేపల పులుసు వండించలేక షాప్ ను కొంతకాలం మూసేస్తున్నట్లు కిర్రాక్ ఆర్పీ తెలిపారు. నెల్లూరు మహిళలు చేపల పులుసు బాగా వండేవాళ్ళు ఎవరైనా వచ్చి ఆడిషన్స్ లో సెలెక్ట్ అయితే వారికి రెస్టారెంట్ లో పనికల్పిస్తామని కిర్రాక్ ప్రకటించాడు. ఇక వంట గది కెపాసిటీ పెంచి వచ్చిన అందరికీ సరిపడా చేపల పులుసు రెడీ చేస్తున్నట్లు చెప్పిన ఆర్పీ కర్రీ పాయింట్ మళ్ళీ గ్రాండ్ గా రీ ఓపెన్ చేసాడు.

రీ ఓపెన్ సమయంలో కూడా జనాలు చేపల పులుసు కోసం బాగానే క్యూ కట్టారు. కొంతంది ఇతర ప్రదేశాల నుండి కూడా హైదరాబాద్ కి వచ్చి తన చేపల పులుసు రుచి చూస్తున్నట్లు ఆర్పీ వివరించారు. పండుగ సమయంలో ఒక నాలుగురోజు షాప్ మూతపడుతుందని మళ్ళీ తిరిగి ఓపెన్ చేస్తామని అయితే రెస్టారెంట్ పనిచేసే సమయం, క్లోజ్ చేసే సమయం ముందుగానే చెబుతామని అది గమనించి రెస్టారెంట్ కి రావాలంటూ ఆర్పీ కోరారు.































