KL Rahul : అద్భుతమైన ఆటగాడు కేఎల్ రాహుల్, బ్యాట్స్ మ్యాన్ అలాగే వికెట్ కీపర్. టీం ఇండియా నుండి పలు మ్యాచ్ లలో మంచి పెరఫార్మెన్స్ ఇచ్చిన రాహుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కొన్నాళ్లగా రాహుల్ సరైన ఫామ్ లో లేడు. ఇక ఈ మధ్య ఆడుతున్న మ్యాచ్ లలో పేలవమైన ప్రధర్శనతో అభిమానులకు నిరాశకు గురిచేస్తున్నాడు. ఇటీవల ఆడిన ఆసియా కప్ మ్యాచ్ లో కూడా తన చెత్త ఆటతో అభిమానులకు విసుగు తెప్పించాడు. ఇక ఆల్రెడీ కోపంగా ఉన్న అభిమానులు రాహుల్ పెళ్లి వార్తను అతనిపై సటైర్లు వేయడానికి ఉపయోగిస్తున్నారు.

సుఖంగా ఉండు బ్రో ఇక టీం ఇండియాకు రావద్దు…
2013 ఐపీల్ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన రాహుల్ ఆ తరువాత టెస్టు మ్యాచ్ ల్లో టీం ఇండియా లోకి ఆరంగేట్రం చేసాడు. ఇక ఆ మరుసటి ఏడాది వన్ డే క్రికెట్ లోకి వచ్చేసాడు. మంచి ప్రదర్శనతో అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండే కేఎల్ రాహుల్ ఓపెనర్ గా రోహిత్, శిఖర్ దావాన్ ఉండటం వల్ల మిడిల్ ఆర్డర్ లో ఆడుతూ వచ్చాడు. కానీ ఐపీల్ మాత్రం ఆరంజ్ కాప్ కోసమే అన్నట్లు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి టాప్ 3 బ్యాట్స్ మాన్ లో ఒకడిగా నిలిచాడు. ఇక రాహుల్ అతీయ శెట్టి అనే కుర్ర హీరోయిన్ తో డేటింగ్ చేస్తూ ఉన్నాడు.

కాగా వచ్చే ఏడాది జనవరిలో ఈ అమ్మడితో పెళ్లి పీటలు ఎక్కనున్నాడట కేఎల్ రాహుల్. ఈ విషయం ఇపుడు బాగా వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తనపై సటైర్లు వేస్తున్నారు. త్వరలో టి 20 ప్రపంచకప్ జట్టులో ఉండనున్న రాహుల్ ఆ మ్యాచ్ తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది క్రికెట్ లవర్స్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు రాహుల్ బ్రో మళ్ళీ జట్టు లోకి రావొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



























