klin kaara: మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ ఉపాసనల వివాహం జరిగిన తర్వాత సుమారు 11 సంవత్సరాలకు బుల్లి మెగా వారసురాలు మెగా ఇంట అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఈ ఏడాది జూన్ 20వ తేదీ క్లిన్ కార జన్మించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ చిన్నారి పుట్టడంతో పెద్ద ఎత్తున అభిమానులు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు.

ఇకపోతే ఈ చిన్నారి ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను ఇప్పటివరకు అభిమానులకు మెగా కుటుంబం పరిచయం చేయలేదు కానీ తనని చూడటం కోసం వచ్చినటువంటి సెలబ్రిటీలందరికీ కూడా తమ చిన్నారిని చూపించారు.ఇక ఉపాసన డెలివరీ అవగానే వెంటనే మెగా ఫ్యామిలీ అంతా కూడా హాస్పిటల్ కి వెళ్లి బుల్లి మెగా వారసురాలిని చూసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఎంతో బిజీగా ఉన్నారు.
దీంతో పవన్ కళ్యాణ్ తమ మనవరాలిని చూడటానికి వీలు కుదరలేదు అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కుమార్తెను చూడలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై ఉపాసన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ అంకుల్ తన కుమార్తె పుట్టినప్పుడు ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారని అనంతరం కార్యక్రమం పూర్తి కాగానే అంకుల్ తన ఇంటికి కూడా వెళ్లకుండా స్వయంగా మా ఇంటికి వచ్చి క్లిన్ కారాని చూశారు అంటూ ఈమె వెల్లడించారు.
అకీరా…ఆధ్యా చూడలేదా
ఇలా పవన్ కళ్యాణ్ తన కుమార్తెను చూశారు అని ఉపాసన చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ వారసులు అకిరా ఆద్య మాత్రం ఇప్పటివరకు క్లిన్ కారానీ చూడలేదని తెలుస్తుంది. వారికి చూసే అవకాశం ఇప్పటివరకు రాలేదు ఇక వరుణ్ తేజ్ వివాహానికి కూడా వీరిద్దరూ హాజరు కాకపోవడంతో వీరికి మెగా వారసురాలిని చూసే అవకాశం రాలేదు.































