Klin kaaraa: మెగా కోడలు ఉపాసన రాంచరణ్ లకు మూగజీవాలు అంటే ఎంత ప్రాణమో మనకు తెలిసిందే. ఇలా మూగజీవాలను సంరక్షణ చేపడుతూ ఇప్పటికే ఎన్నో జంతువులను తమ ఇంట్లో పెంచుతూ ఉండగా మరికొన్ని జంతువులను వీరు దత్తత తీసుకొని వాటి సంరక్షణ బాధ్యతలను కూడా తీసుకున్నారు.

ఈ విధంగా మూగజీవాలు అంటే ఎంతో ప్రాణం ఇచ్చే ఉపాసన రాంచరణ్ ప్రస్తుతం తమ బిడ్డ ఆలనా పాలన చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇలా తమకు కుమార్తె జన్మించినప్పటికీ మూగజీవాల పట్ల ఏమాత్రం ప్రేమ తగ్గలేదని చెప్పాలి. రామ్ చరణ్ ఉపాసనలకు ఎంతో ఇష్టమైనటువంటి పెట్ డాగ్ రైమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ఎక్కడికి వెళ్ళినా తమ వెంట రైమ్ ఉంటుంది.
ఇక ఈ రైమ్ కి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఒక ఇంస్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను ఈ ఇంస్టాగ్రామ్ పేజ్ ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా రైమ్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Klin kaaraa: చెల్లిపై ఓ కన్నేసాను…
ఉపాసన కుమార్తెను వదిలి రైమ్ ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారని తెలుస్తుంది. తను పడుకున్న కూడా తనకు కాపలాగా రైమ్ ఉన్నారని తాజాగా ఈ ఫోటో ద్వారా తెలుస్తుంది. చిన్నారి క్లీన్ కారా ఊయలలో పడుకొని ఉండగా రైమ్ మాత్రం తనని చూస్తూ ఉంది ఈ ఫోటోని షేర్ చేసిన అనంతరం ఈ ఫోటోకి నైట్ డ్యూటీ చేస్తున్నా.. చెల్లిపై ఓ కన్నేసాను అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.