Kodali Nani: కొడాలి నాని గత ప్రభుత్వంలో ఈయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే కొడాలి నాని ఫైర్ బ్రాండ్ గా బూతుల మంత్రిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన కాస్త సైలెంట్ అయ్యారని వార్తలు వచ్చాయి అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈయన ఇంటిపై పెద్ద ఎత్తున కోడిగుడ్లతో దాడి చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

ఇలా కొడాలి నాని గురించి ఆయన ఇంటిపై పెద్ద ఎత్తున దాడులు జరిగిన ఇప్పటివరకు స్పందించని కొడాలి నాని తాజాగా మీడియా ముందుకు వచ్చి తన స్టైల్ లో అధికార నేతలకు కూడా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఫర్నిచర్ మొత్తం మాయమైందని తన ఇంట్లో ఉందంటూ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కొడాలి నాని స్పందించారు. ప్రభుత్వ ఫర్నిచర్ ను జగన్ మోహన్ రెడ్డి తన ఇంట్లో తన సాక్షి ఆఫీసులో వేసుకోలేదని ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలోనే ఉందని తెలిపారు.
అవసరమైతే వచ్చి తీసుకెళ్లండి లేకపోతే ఎంత డబ్బు ఖర్చు అయిందో చెబితే మీ మోహన పడేస్తామనీ తెలిపారు.. ఇక రిషికొండ భవనాల గురించి మాట్లాడుతూ అది జగన్ కట్టుకున్న భవనమని ప్రచారాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అలాంటి ప్రభుత్వ భవనాలలో ఉండే కర్మ పట్టలేదని తెలిపారు. ఆయన తాడేపల్లిలో కూడా సొంత నివాసం కట్టుకున్నారు. ఇక వైజాగ్ వచ్చిన అక్కడ కూడా సొంత ఇల్లు కట్టుకొని నివసిస్తారు తప్పా.. మీలా ఎవరి కొంపల్లోనూ దూరి ఉండరని నాని తెలిపారు.
సొంత ఇంట్లోనే నివసిస్తారు..
ఇక సూపర్ సిక్స్ హామీల గురించి కూడా ప్రశ్నించారు. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు కల్పిస్తున్నారు ప్రతి 18 సంవత్సరాల నిండా మహిళకు 1500 ఎప్పుడు ఇస్తున్నారు. 4000 పెన్షన్ ఎప్పటినుంచి అమలు చేస్తున్నారు అంటూ వరుసగా ప్రశ్నించారు. వీటి గురించి ఆలోచన చేయకుండా ఋషికొండ భవనాలు పోలవరం అంటూ తప్పించుకోనీ తిరుగుతున్నారంటూ నాని తనదైన స్టైల్ లోనే మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























