Manjima Mohan: తమిళ సినిమా పరిశ్రమకు చెందిన హీరో, హీరోయిన్లు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్‌లు ప్రేమలో ఉన్నారంటూ గతకొంత కాలం నుంచీ ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా వీరిద్దరి పెళ్లికి పెద్దలు కూడా ఓకే చెప్పేశారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ తెగ గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయంపై వారిద్దరిలో ఏ ఒక్కరూ అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. అయితే ఈ మధ్య మంజిమా పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా తన ప్రియురాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ హీరో గౌతమ్ కార్తిక్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో వారిద్దరూ ప్రేమలో ఉన్నది నిజమేనని చాలా మంది భావించారు.

మంజిమాను ముద్దుగా మోమో అని పిలిచుకునే గౌతమ్, ‘మాంజిమా లాంటి అద్భుతమైన, శక్తిమంతమైన వ్యక్తి తన జీవితంలో ఉండటం గొప్పగా భావిస్తాను. హ్యాపీ బర్త్ డే మోమో’ అని పోస్ట్ పెట్టడంతో కోలీవుడ్‌ల్ ఈ వార్త సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తాజాగా తమ రిలేషన్‌పై వస్తోన్న వార్తలపై నోరు విప్పారు మంజిమ. ఆ వార్తలన్నీ అబద్ధమేనని ఆమె కొట్టి పారేసింది. గౌతమ్‌తో పెళ్లి అంటూ వచ్చి వార్తలు చూసి తాను నిజంగా షాకవడంతో పాటు, చాలా భయపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.. ఈ వార్తలపై తన తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవతారోనని భయపడ్డాను , కానీ వారు ఈ పుకార్లను అంతగా పట్టించుకోలేదని ఆమె అన్నారు.

తన జీవితంలోని ముఖ్యమైన విషయాలను దాచే అవసరం లేదన్న ఆమె, నిజంగా ప్రేమలో ఉంటే తప్పకుండా దాన్ని అందరికీ తెలియజేస్తాను’ అంటూ మంజిమా స్పష్టం చేశారు.కాగా తెలుగులో నాగచైతన్య సరసన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ, ఆ సినిమాలో ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి పేరొచ్చినట్టు సమాచారం.
మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డ్…
ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా విష్ణు విశాల్ ‘ఎఫ్‌ఐఆర్’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించారు. ఇక అభినందన, అన్వేషణ తదితర చిత్రాలతో ఆకట్టుకున్న నిన్నటి తరం హీరో కార్తిక్ వారసుడే. కాదల్ (తెలుగులో కడలి) తో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ఉత్తమ డెబ్యూ హీరోగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం అందుకున్నాడు. మంజిమా, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ కలిసి ‘దేవరట్టం’ అనే చిత్రంలో నటించారు.





























