Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయలేదు. తాజాగా మళ్ళీ రైటర్ గా పూర్తి బాధ్యత తీసుకుని సూర్య డైరెక్షన్ లో వస్తున్న విష్ణు సినిమాతో వస్తున్నారు.

అఖిల్ సినిమా వద్దని చెబితే వినలేదు…
అక్కినేని అఖిల్ ను సినిమా ఇండస్ట్రీ లోకి లాంచ్ చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అఖిల్’. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది, అఖిల్ కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దానికి తోడు వినాయక్ కు కూడా కెరీర్ డౌన్ ఫాల్ కి కారణమైంది. ఇక ఆ సినిమా కథ రెడీ చేసుకున్నపుడే ఆ సినిమా వద్దు అని ఎంత చెప్పినా వినాయక్ వినలేదు అంటూ కోన వెంకట్ చెప్పారు. కథ విన్నప్పుడే ఇది వర్క్ అవుట్ అవ్వదు అని చెప్పినా వినాయక్ వినిపించుకోలేదు ఆ తరువాత డైరెక్టర్ బాబీ, విజయ భాస్కర్ ఇలా అందరితో చెప్పించినా వినాయక్ వినలేదు. ఆ తరువాత సినిమా పరిస్థితి అందరికీ తెలుసు అంటూ చెప్పారు. ఒక కథను జడ్జి చేయడంలో కొంచం పరిజ్ఞానం ఉండటం వల్ల ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు నా మాటకు విలువ ఇస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మంచు విష్ణు హీరో గా వస్తున్న ‘జిన్నా’ సినిమా విషయంలో బాధ్యత తీసుకున్నానని కోన చెప్పారు.

డైరెక్టర్ సూర్య, శీను వైట్ల దగ్గర అసిస్టెంట్ గా పని చేసేటప్పటి నుండి తెలుసు. తనకు బాధ్యత తీసుకుంటానని మాటిచ్చానని, అందుకే రైటర్ గా నా పని పూర్తి చేశాను అంటూ ఇక టైటిల్ వివాదం గురించి మాట్లాడుతూ జిన్నా అనే టైటిల్ జీ నాగేశ్వరావు కాబట్టి తొలి అక్షరాలను కలిపి జిన్నా అని పెట్టారు. అందులో రాద్ధాంతం చేయడానికి ఏముంది ఒకవేళ హీరో ముస్లిం అయ్యుండి ఆ పేరు ఉండి వేరే జోనర్ సినిమా అయ్యుంటే అపుడు అభ్యంతరం చెప్పాలి కానీ అసలు కథకు పాకిస్థాన్ నాయకుడు జిన్నా కు సంబంధం లేని సినిమాకి ఆ టైటిల్ పెడితే ఎందుకు వివాదం చేయడం అంటూ చెప్పారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పారు.
































