Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీ లో కోన వెంకట్ కు మొదటి నుండి ఆర్జివి తో అనుబంధం ఉంది. తనతో జర్నీ గురించి వివరించారు.

ఆర్జీవి నా గురువు… నేను చేయనన్నా వినలేదు…
కొత్త పంథాను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి అంటే ఆర్జీవి నే. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. ఇక ఆర్జీవి తన గురువు అంటూ కోన వెంకట్ అంటున్నారు. తాను అంగీకరించక పోయినా ఆర్జీవి నా గురువు అంతకంటే ఎక్కువ. తాను నాకేమి విద్య నేర్పించలేదు, కానీ అవకాశాం ఇచ్చాడు. గురువు విద్య మాత్రమే నేర్పుతాడు కానీ అవకాశం ఇచ్చినవాడు ఇంకా గొప్పవాడు కదా అలా ఆర్జీవి ఇంకా గొప్పవాడు నా జీవితంలో అంటూ చెప్పారు కోన వెంకట్.

నేను కెరీర్ లేక ఇంట్లో వాళ్ళకే మొహం చూపించుకోలేక ఉన్న రోజున ఆర్జీవి పిలిచి ‘సత్య’ సినిమాలో తెలుగు డైలాగ్స్ కి రైటర్ గా పనిచేయమన్నాడు. నాకు రాదు, నేను చేయను అని ఎంత చెప్పినా వినలేదు. నువ్వు ముందు రా కలిసి పని చేద్దాం అంటూ నాతో బలవంతంగా పని చేయించాడు. ఇక ఆ ఒక్క అవకాశంతో మళ్ళీ కోన వెంకట్ జీవితం మారిపోయింది. ఇప్పుడు రైటర్ గా ఉన్నాను అంటే అది ఆర్జీవి వల్లే అంటూ చెప్పారు కోన వెంకట్.



























