Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్, తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల, కోన వెంకట్ జోడి సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు మళ్ళీ కలిసి పనిచేయలేదు. సినిమా ఇండస్ట్రీ విషయాలను అలాగే రాజకీయాల గురించి కోన తన అభిప్రాయాలను చెప్పారు. ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ స్నేహం గురించి మాట్లాడారు.

ఎన్టీఆర్ కొడాలి నాని మాట వినేవాడు… పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు…
‘ఆది’ సినిమా తో వినాయక్ తో ఎన్టీఆర్ పరిచయం, ఆ తరువాత అదుర్స్ సినిమా, ఇక ఆ తరువాత సాంబ సినిమాలకు వినాయక్ దర్శకత్వం, అయితే ఈ సినిమాలకు కొడాలి నాని, వల్లభ నేని వంశీ లు ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురూ మంచి మిత్రులు ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక కోన వీరి స్నేహం గురించి మాట్లాడుతూ కొడాలి నాని వల్లభనేని వంశీ ఏం చెప్పినా తారక్ వినేవాడు. కానీ నిర్ణయం మాత్రం తానే తీసుకునేవాడు. చిన్నవయసులోనే ఎన్టీఆర్ కు చాలా మేచూరిటీ ఉండేది. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది.

వినాయక్ ను అడిగేవాడిని ఏంటి అసలు ఇంత చిన్న వయసులో అంత పరిపక్వత, కమాండింగ్ ఎలా వచ్చాయి అని అడిగేవాడిని. అయితే ఎన్టీఆర్ కు చాలా చిన్న వయసులోనే స్టార్ డమ్ వచ్చింది అది రావడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. అదీకాక చిన్న వయసులోనే తన వయసుకు మించి బాధ్యతలను కూడా తీసుకున్నాడు. తన వయసు, అనుభవం ఏ మాత్రం దానికి సరిపోవు కానీ చాలా చక్కగా వాటిని హ్యాండిల్ చేసాడు. ఇక తనకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు. వాటి గురించి మాట్లాడితే మనకెందుకు పాలిటిక్స్ అన్న అంటూ మాట్లాడేవాడు. చిన్నవయసులోనే తాను కష్టపడి కుంభస్థలం కొట్టాలనే ధ్యేయం ఉంది అందుకే అంత కస్టపడి పైకి వచ్చాడు అని అన్నారు.




























