Kona Venkat : తెలుగు సినిమా రైటర్, ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ తన పంచ్ డైలాగులకు బాగా ఫేమస్. దూకుడు, అదుర్స్, అల్లుడు శీను వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిందీ సినిమాలకు డబ్బింగ్ రైటర్ గా పనిచేసిన కోన వెంకట్ దాదాపు 50 సినిమాలకు పనిచేసాడు. ఇటీవలే తాను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళు గడిచిన సందర్బంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక శీను వైట్ల తో కలసి పని చేసిన కోన వెంకట్ సినిమాల్లో మంచి హిట్లు అందుకున్నారు. కానీ వాళ్ళ మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ మళ్ళీ కలిసి పనిచేయలేదు.

గుర్తింపు లేని చోట పనిచేయలేము…
‘వెంకీ’ సినిమా మంచి హిట్ అవ్వడంతో కోన వెంకట్, శీను వైట్ల, గోపి మోహన్ వరుసగా సినిమాలకు కలిసి పనిచేసారు. ఇక ‘దూకుడు’ సినిమా పూర్తవుతున్న సమయంలోనే ‘ఆగడు’ గురించి చర్చ మొదలయింది. ఆ సమయంలో దూకుడు సినిమా కోసం అందరం కష్టపడితే సినిమా టైటిల్ కార్డ్స్ లో కొన్ని సినిమాలకు మా పేర్లు వేయలేదు. సినిమా ఇండస్ట్రీ కి వచ్చేది గుర్తింపు కోసమే, అదే లేనపుడు ఇంకెందుకు పని చేయాలి.

ఒక గుర్తింపు లేని చోట పని చేయలేము అంటూ చెప్పారు కోన వెంకట్. అది చిన్న కారణమే అయినా చాలా బాధ పెట్టింది. నేను చేస్తున్న పనిలో నాకు పేరు లేకపోతే అర్థమేముంది అనిపించింది. ఇప్పుడు ఆలోచస్తే చాలా చిన్న విషయానికి వాదించుకున్నాం అని అనిపిస్తుంది అంటూ కోన వెంకట్ శీను వైట్ల తో ఉన్నవి మరీ పెద్ద గొడవలేమి కాదు అని చెప్పారు.

































