Kona Venkat: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తల వినపడుతూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల ఎఫైర్ల రూమర్లు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇక హీరోయిన్ల విషయంలో ఇది కాస్త ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి . ఇలా ఎంతో మంది హీరోయిన్లు అఫైర్స్ అంటూ వార్తల్లో నిలిచారు. అందులో అంజలి కూడా ఉన్నారని చెప్పాలి. ఈమె కూడా పలనా హీరోతో, రిలేషన్ లో ఉన్నారని ఫలానా నిర్మాతతో రిలేషన్ లో ఉన్నారు అంటూ తన గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

ఇలా అంజలి గురించి వచ్చినటువంటి వార్తలలో ప్రముఖ రైటర్ నిర్మాత కోన వెంకట్ కూడా ఒకరు . అంజలి కోన వెంకట్ మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తమ గురించి వస్తున్నటువంటి వార్తలపై కోన వెంకట స్పందిస్తూ అంజలితో తనకున్న రిలేషన్ ఏంటి అనే విషయాన్ని బయటపెట్టారు.
ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. నేను పర్సనల్ గా అంజలికి సపోర్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అందుకు మా ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ వార్తలు సృష్టించడం తప్పు అని తెలిపారు ఆమె చిన్నప్పటినుంచి తన వ్యక్తిగత జీవితం పూర్తిగా తెలిసిన వ్యక్తిని తాను. అందుకే తనకు సపోర్టుగా నిలిచానని వెల్లడించారు.
ఇక అంజలిని ఒక చెల్లిగాను, ఒక కూతురి గాను, ఒక బెస్ట్ ఫ్రెండ్ గా భావించి ఎలా పిలవమని చెప్పినా తాను పిలవడానికి సిద్ధమేనని వెల్లడించారు. ఇలా అంజలితో తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ ఈయన వారి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో క్లారిటీ ఇచ్చారు. ఇలా కోన వెంకట చేసిన ఈ వ్యాఖ్యలతో ఈ వార్తలకు పూర్తిస్థాయిలో పోలీస్ స్టాప్ పడిందని చెప్పాలి.కాగా కోనా వెంకట్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ ఎంటర్టైనర్స్ కి కథలు, మాటలు అందించిన సంగతి తెలిసిందే.
Latest Videos :



























