Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులు తెలియనివారు ఉండరు. వరంగల్ గ్రామీణ ప్రాంతానికి చెందిన కొండా మురళి వంచనగిరి విలేజ్ సర్పంచ్ గా 1987 లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1987 నుండి 1992 వరకు మురళీధర్ గారు మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గాను , మున్నూరు కాపు యూత్ కోసం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక మురళిపై సర్పంచ్ గా ఉన్న సమయంలో జరిగిన కాల్పులు, అప్పటి భయానక పరిస్థితుల గురించి కొండా సినిమా విడుదలయ్యాక సురేఖ గారు పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
ఆయన వెనక్కి రాకుంటే నా కూతురిని కాల్చేవారు…

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా దంపతులు జీవితాన్ని సినిమాగా తీశారు. ఈ సినిమా విడుదలయి థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొండా సురేఖ తన కూతురు సుస్మిత పటేల్ గురించి తాను తన బిడ్డ చిన్నగా ఉన్నపుడు పడిన కష్టాలను కొండా మురళి గారిని కాల్చినప్పుడు జరిగిన పరిణామాలను చెప్పారు. జనవరి 26 న జెండా ఎగురవేయడానికి సర్పంచ్ గా వెళ్లగా కూతురిని కూడా తీసుకెళ్లారు. ఇక అదే సమయంలో అయనపై కాల్పులు జరిగినపుడు ఆ సమయంలో కూతురు అక్కడే ఉంది నాన్న.. అంటూ అరుస్తూ కాళ్ళు గట్టిగా పట్టుకుందట కానీ ఆయన అక్కడే వదిలి పారిపోయారు.

అయితే ఆయన కూతుర్ని కాల్చారనే అనుమానంతో మళ్ళీ వెనక్కి వచ్చారు. అప్పటికే కూతురిని కొండా అనుచరులు తప్పించారు అయితే మురళి పై కాల్పులు జరిగాయి. ఇక ఇప్పటికి ఆయన శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నాయి. ఇక ఇదంతా చూసిన కూతురు సుస్మిత వయసు అప్పటికి నాలుగు సంవత్సరాలు. దీంతో ఆమె కోలుకోడానికి చాలా రోజులు పట్టిందని మొహం లో రక్తం లేకుండా చల్ల బడినట్లు అయిపోయి, ఎవరితో మాట్లాడకుండా స్థబ్దంగా ఉండిపోయిందని వెల్లడించారు కొండా సురేఖ. ఇక కొండా మురళి గారిని జైల్లో పెట్టినపుడు అర్ధరాత్రులు వెళ్లాల్సి వచ్చేదని. ఆ సమయంలో కూతుర్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్లిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు సురేఖ.ఇక కొండా సినిమా బాగా ఆడుతోందని కానీ ఇప్పటి పరిస్థితుల్లో చాలా మంది థియేటర్లలో చూడడానికి ఆసక్తి చూపడం లేదంటూ అభిప్రాయపడ్డారు.


































