Kota Srinivas Rao about young heroes : ఇప్పుడు ఉన్న టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఎవరు బాగా నటిస్తారంటే ఎవరికీ వారు వారి అభిమాన హీరోనే బాగా నటిస్తాడు అంటూ వాదిస్తారు. ఇక కొంత మంది సీనియర్ ఆర్టిస్టులు కొంత మంది సెలబ్రిటీలు వారికి నచ్చిన ఆ హీరోల నటన గురించి ప్రస్తావిస్తూంటారు. సీనియర్ నటుడు విలక్షణమైన తన విలనిజం, కామెడీ టైమింగ్‌తో మెప్పించిన కోటా శ్రీనివాసరావు కూడా ఈతరం టాప్ హీరోస్ గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.

రామ్ చరణ్ వారి తరువాతే…..
ఇక టాప్ హీరోస్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తరువాతే రామ్ చరణ్ వస్తాడంటూ ఆసక్తికరంగా చెప్పారు. చిరంజీవి కొడుకుగానే ఇంకా రామ్ చరణ్ కనిపిస్తున్నాడు సినిమాలు చేస్తున్నాడు మంచి పాత్రలు వస్తే తనలో ఉన్న మంచి నటుడు కనిపిస్తాడంటూ చెప్పారు.

ఇప్పటి హీరోలలో ఎన్టీఆర్ కు పోటీలేరు….
ఇక తనకు ఈ తరం నటులలో నచ్చేది ఎన్టీఆర్ అంటూ సూటిగా చెప్పారు. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, జ్ఞాపక శక్తి, ముఖకవళికలు అద్భుతం. జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఎన్టీఆర్‌గారి ఇమేజ్‌కి తగ్గట్టుగా జీవించారు. జనాలు జూనియర్ ఎన్టీఆర్‌ని పొట్టోడు అని పిలిచేవారు. కానీ చంద్రమోహన్ లాగా ఎన్టీఆర్ కు తన ఫిజిక్ ప్లస్ అయింది. జూనియర్ ఎన్టీఆర్‌తో ఎవరూ పోటీ పడలేరు. అతని సత్తా సాటిలేనిది, అలాంటి సత్తా మరెవరికీ లేదు. బన్నీ, మహేష్ బాబు వంటి మంచి నటులు ఖచ్చితంగా ఉన్నారు, కానీ జూనియర్ ఎన్టీఆర్‌తో ఎవరూ సాటిలేరు అంటూ చెప్పారు.


































