Kota Srinivasarao : విలన్ గా, కామెడీ విలన్ గా, అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమారు 750 సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. బాబు మోహన్ కోట గారి కాంబినేషన్ అంటే ఆ రోజుల్లో సినిమా కు మినిమమ్ గ్యారెంటీ అనేంతలా వారి పాత్రలు ఉండేవి, కామెడీ పండేది. ఇక సీరియస్ విలన్ గా కూడా రాణించిన కోట గారు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యే గా పనిచేసారు. ఇక ఇపుడు వృధాప్య సమస్యలతో సినిమాలలో పెద్దగా కనిపించని కోట గారు ఇండస్ట్రీ గురించి ఇప్పటి తరం నటుల గురించి ఆయన అభిప్రయాలను పలు ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు.

నేను ఆ రోజు గొడవ చేయకపోతే ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేది కాదు…
ఇక మద్రాస్ నుండి తెలుగు ఇండస్ట్రీ ని హైదరాబాద్ కు తరలించాలని భావించినపుడు మద్రాస్ వాళ్ళు అక్కడికి వచ్చి పనిచేయమని, అక్కడ ఏముందని అంటూ బాగా గొడవ చేస్తే అందరూ అన్ని చోట్ల పనిచేసుకునే స్వేచ్చ ఉండాలి అంటూ 1994 లో నాయుడు గారి కళా మండపంలో నిరాహారదీక్ష ను నాలుగున్నర రోజుల పాటు చేశానని కోట గారు గుర్తు చేసుకున్నారు. నిజానికి అంత సీరియస్ గా దీక్ష చేశాను కాబట్టే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చింది లేకపోతే అయ్యుండేదికాదు. ఈ విషయాన్ని ఎవరూ చెప్పరు కానీ నేను పట్టించుకోను అంటూ చెప్పారు.

ఇక ఇప్పటి తరం హీరోల గురించి మాట్లాడుతూ ఒక సినిమా చేసి అది కొంచెం హిట్ అయిందంటే చాలు టీవీలో ఇంటర్వ్యూ లలో కాలు మీద కాలేసుకుని ఊపుతూ మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీ లో ఇప్పటి తరం వారికి సాధన తక్కువ వాదన ఎక్కువ, ఎన్నో గొప్ప సినిమాలను చేసి సక్సెస్ చూసిన వారు కూడా మీడియా అంటే చాలా గౌరవం తో వ్యవహారిస్తారు కానీ ఇప్పటి వాళ్ళు అలా కాదు అంటూ కామెంట్స్ చేసారు. ఇక మాతృ భాషను విస్మరించడం అంత పాపం మరొకటి లేదు, పొట్టకూటి కోసం ఏ భాష అయినా నేర్చుకోవచ్చు కానీ మాతృభాష మర్చిపోతే ఎలా అంటూ ప్రస్తుత పోకడలను విమర్శించారు.

































