Kotam reddy Sridhar Reddy : నెల్లూరు రాజకీయం కోటంరెడ్డి ప్రెస్ మీట్ తో వేడెక్కింది. జగన్ మీద తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి ప్రభుత్వం అనేక ఆరోపణలను చేసారు. ఎన్నికలకు ఏడాది సమయం ఇంకా ఉన్నపుడే అసమ్మతి జ్వలలు వైసీపీ ఎదుర్కొనవలసి వస్తోంది. జగన్ తనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం పలువురు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడిన సంగతి తెలిసిందే, అలా కోటంరెడ్డిని పిలిచి తిట్టారంటూ బయటకి కొంతమంది లీక్ ఇచ్చిన వాటి మీద తనదైన సమాధానం కోటంరెడ్డి వివరించారు.

జగన్ వార్నింగ్ ఇచ్చాడా…
కోటంరెడ్డి ఎపిసోడ్ రాజకీయాల్లో కాకపుట్టిస్తున్నా జగన్ అంటే అభిమానము ఉందని అయితే ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయనకు తప్పుడు సలహాలు ఇస్తున్నారంటూ చెప్పారు కోటంరెడ్డి. తనని పిలిచి మాట్లాడినపుడు తిట్టారని, కాఫీ కప్పు విసిరాడంటూ వినిపిస్తున్న కథనాలను గురించి ప్రస్థావించినపుడు అలాంటి అవమానం గనుక జరిగి ఉంటే మీటింగ్ నుండి బయటికి వచ్చిన వెంటనే ప్రెస్ మెట్ పెట్టేవాడిని. నేనేం చేసానని నాకు ఇంత అవమానం చేసావ్ జగన్ అని అడిగిండేవాడిని. అవన్నీ వట్టి పుకార్లే అంటూ చెప్పారు.

జగన్ అంటే అభిమానం ఉండేది కాబట్టి ఇప్పుడు ఇంత ద్వేషం వచ్చింది. సజ్జల రామకృష్ణ వంటి వారు నా మీద అవినీతి ఆరోపణలను చేసి జగన్ కి లేని పోనివి చెప్పి నన్ను జగన్ కు దూరం చేసారు అంటూ చెప్పారు. నెల్లూరు జెడ్పిటిసి చైర్మన్ ను నియమించే సమయంలో జిల్లాలో ఎమ్మెల్యే అయిన నాకు తెలియకుండా చేసినా బాధపడ్డానే కానీ జగన్ కు వ్యతిరేకంగా వెళ్లాలని అనుకోలేదు. రెండు సార్లు మంత్రి పదవి ఇవ్వకపోయినా బాధపడ్డాను కానీ వ్యతిరేకం కాలేదు. కానీ ఇపుడు ఇతరుల మాటలు విని కనీసం నన్ను వివరణ అడగకుండా ఇలా చేయడం బాధనిపించింది అంటూ కోటంరెడ్డి చెప్పారు.



































