Kotamreddy Sridhar Reddy : నెల్లూరు రాజకీయం కోటంరెడ్డి ప్రెస్ మీట్ తో వేడెక్కింది. జగన్ మీద తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి ప్రభుత్వంపై అనేక ఆరోపణలను చేసారు. ఎన్నికలకు ఏడాది సమయం ఇంకా ఉన్నపుడే అసమ్మతి జ్వాలలు వైసీపీ ఎదుర్కొనవలసి వస్తోంది. జగన్ తనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం పలువురు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడిన సంగతి తెలిసిందే. అలా కోటంరెడ్డిని పిలిచి తిట్టారంటూ బయటకి కొంతమంది లీక్ ఇచ్చినా వాటి మీద తనదైన సమాధానం కోటంరెడ్డి వివరించారు. అలాగే భవిష్యత్ రాజకీయాల గురించి తన తమ్ముడి రాజకీయ భవిష్యత్తు గురించి ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

తమ్ముడిని ఎమ్మెల్యే చేయాలనుకున్నా…
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నుండి నాపై ఆరోపణలు చేస్తున్న సజ్జల వంటి వారు నేను చంద్రబాబు నాయుడు ని డిసెంబర్ 21 న కలిసానని చెబుతున్నారు. ఒకవేళ అప్పుడే కలిసుంటే వారికి తెలిసీ ఎందుకు పార్టీలో ఉంచారు, అప్పుడే తొలగించాల్సింది కదా. అవన్నీ ఒట్టి ఆరోపణలయి అంటూ చెప్పారు. ఇక తమ్ముడికి వైసీపీ ని వీడడం ఇష్టం లేదు అసంతృప్తితో ఉన్నారు అన్న మాటలకు అదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

తనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్తిగా వచ్చే ఎన్నికలలో నిలబెట్టాలని అనుకున్నాను. తనకి ఆ మాట చెప్పాను కానీ చివరికి ఇలా అయింది, నేనే నిలబడతాను అన్నట్లుగా చెప్పారు కోటంరెడ్డి. తమ్ముడి రాజకీయ భవిష్యత్తును ఆలోచిస్తున్నట్లు, ఈ సరి ఎన్నికలలో వైసీపీ కి పోటీగా నిలబడిన గెలుస్తాననే ధీమా ఉందని, జగన్ కి 175 సీట్లు గెలుస్తాననే నమ్మకం ఉన్నపుడు నాకు నా ఎమ్మెల్యే సీట్ గెలుస్తానని నమ్మకం ఎందుకు ఉండకూడదు అంటూ చెప్పారు. చంద్రబాబు ను ఇంతవరకూ కలవలేదని, కావాలనే సజ్జల రామకృష్ణ వంటి వారు నాపై బురద జల్లారంటూ చెప్పారు.



































