Koushal Manda : మోడల్ గా తన కెరీర్ మొదలుపెట్టిన కౌశల్ మండ ఆ తరువాత సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నాని హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఆర్మీలంటూ మొదలైంది కౌశల్ నుండే. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో బిగ్ బాస్ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్శించాడు కౌశల్.

అమ్మను బ్రతికించుకోవడం కోసం ఆ సినిమా…
ఇక తొలి రోజుల్లో మోడలింగ్ చేసిన కౌశల్ మండ చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా దూరదర్శన్ లో చేసాడు. ఇక మోడలింగ్ చేస్తూనే సినిమాలో హీరో అవకాశం రావడం, అదే సమయంలో తన తల్లి క్యాన్సర్ భారిన పడి చికిత్స కోసం ఎక్కువ డబ్బు ఖర్చు కావడంతో డబ్బుకోసం సినిమా చేసాడు. 50,000 రూపాయల పారితోషకం తీసున్నాడు. ఆ సినిమా తరువాత తన పై బ్యాడ్ ఒపీనియన్ వచ్చిందని కెరీర్ నాశనమైందని తాజాగా ఇంటర్వ్యూల్లో చెప్పాడు కౌశల్. ఇక ఆ తరువాత తన తల్లి మరణించాక కోలుకోడానికి చాలా సమయం పట్టిందని చెప్తూ, అప్పట్లో ప్రసారమయ్యే చక్రవాకం సీరియల్ గురించి అందరూ మాట్లాడుకుంటుంటే నేను ట్రై చేయొచ్చు అనిపించి మంజుల మేడం ను కలిసి చక్రవాకం సీరియల్ లో నెక్స్ట్ తరం వారిలో హీరోగా చేసానని చెప్పాడు.

ఆ సీరియల్ లో సాగర్ పాత్ర బాగా పేరు తెచ్చిందని చెప్పాడు. ఆ తరువాత పలు సీరియల్స్ లో నటించిన కౌశల్, జీ తెలుగులో ప్రసారమైన సూర్యవంశం సీరియల్ లో నటించారు. ఇక ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 2 లో అడుగుపెట్టి ఫేమస్ అయ్యారు. దాదాపు చాలా సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలాంటివి చేసిన కౌశల్ బిగ్ బాస్ తరువాత మెయిన్ లీడ్ లో ‘అతడు ఆమె ప్రియుడు’ అనే సినిమాలో నటించారు. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో సునీల్, బెనర్జీ తో పాటు నటించాడు. ఇక ఉదయ్ కిరణ్ తో దాదాపు తొమ్మిది సినిమాల్లో కలిసి నటించిన కౌశల్ ఉదయ్ కిరణ్ చావుకు ఏమి కారణమై ఉండొచ్చనే ప్రశ్నకు ఉదయ్ కిరణ్ ఫ్యామిలీలో ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వచ్చే జబ్బు ఉందని అందుకే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని చెప్పారు.

ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి అని అందుకే ఇప్పటికి ఆయన గురించి సోషల్ మీడియాలో పుట్టినరోజు నాడు అలా పోస్ట్ పెడుతూ గుర్తుచేసుకుంటానని ప్రపంచం మర్చిపోయినా నేను ఉదయ్ కిరణ్ ను మర్చిపోలేదని చెప్పారు. ఇక కౌశల్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రైట్ మలయాళం లో దృశ్యం సినిమా తీసిన దర్శకుడి సినిమా రీమేక్ గా ఈసినిమా రాబోతోంది. మలయాళం లో ఈ సినిమాను పృథ్వీ చేసారు. త్వరలోనే రాబోతున్న ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు కౌశల్.



























