Koushal Manda : బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా వచ్చి విన్నర్ అయి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, మోడల్ కౌశల్ మండా. కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ ఆ సీజన్ లో బాగా హైలైట్ అయింది. అంత ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న కౌశల్ బిగ్ బాస్ తరువాత వరుస అవకాశాలతో బాగా బిజీ అవుతారు అని అందరూ భావించినా అందుకు భిన్నంగా ఆయన వెండి తెర మీద కానీ బుల్లి తెర మీద కానీ పెద్దగా కనిపించలేదు. ఇక కౌశల్ మొదట సినిమాల్లో అడుగుపెట్టాడు. ఎన్నో సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసాడు.

ఉదయ్ కిరణ్ ను మర్చిపోలేదు…
ఎక్కువగా ఉదయ్ కిరణ్ సినిమాల్లో నటించిన కౌశల్ దాదాపు 9 సినిమాల్లో అతనితో కలిసి నటించారు. ఇక ఉదయ్ కిరణ్ తో చక్కటి అనుబంధం ఉంది అంటూ చెప్పారు. ఆయన తన వ్యక్తిగత కారణాలతో మరణించినా ఆయనను నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అయన పుట్టిన రోజునాడు ఖచ్చితంగా విష్ పెడతాను అంటూ చెప్పారు. ఇక యండమూరి గారి సినిమా ‘అతడు ఆమె ప్రియుడు’ లో మెయిన్ లీడ్ లో సునీల్ తో పాటు నటించిన కౌశల్ ఆ సినిమా గురించి చెబుతూ అందులో సునీల్ క్యారెక్టర్ ప్లే బాయ్ క్యారెక్టర్, పూటకో అమ్మాయితో గడపాలనుకునే మైండ్ సెట్ ఉంటుంది అంటూ చెప్పారు.

సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో తల్లికి క్యాన్సర్ రావడంతో డబ్బు కోసం ఒక డిఫరెంట్ సినిమా చేశానని, ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశాను. ఆ సినిమాతో నేను అడల్ట్ సినిమా చేశాను అనే ముద్ర పడి కెరీర్ కి దెబ్బపడింది, ఇక తల్లిని కూడా బ్రతికించుకోలేక పోయాను అంటూ చెప్పారు. ఇక సినిమాలకు గ్యాప్ వచ్చినపుడు ‘చక్రవాకం’ సీరియల్ లో చేశాను, ఆ సీరియల్ లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ‘సూర్యవంశం’ అనే సీరియల్ కూడా చేసినట్లు కౌశల్ మండా తెలిపారు.


































