హరిహర వీరమల్లు గా పవన్ లుక్ మహా శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఈ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కింది.. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ లుక్ లో ఓ రేంజ్ లో ఉన్నాడని అభిమానులు తెగ పొగిడేశారు… చారిత్రాత్మక లుక్ లో పవన్ కళ్యాణ్ ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని సోషల్ మీడియా లో తెగ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా పవన్ ఫాన్స్ హంగామా తగ్గలేదు.. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా టైటిల్ ని కూడా ఈ లుక్ లో రివీల్ చేశారు.
ఈ లుక్ పవన్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వకీల్ సాబ్ తర్వాత సరైన అప్ డేట్ లేక అల్లాడిపోతున్న పవన్ ఫ్యాన్స్ కి ఈ లుక్ వచ్చాక పండగ చేసుకుంటున్నారు.. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ లో పవన్ కళ్లప్పగించి మరీ చూస్తున్నారు. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై క్రిష్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా క్రిష్ కెరీర్ లో సరైన హిట్టు పడలేదు.
ఎన్టీఆర్ బయోపిక్ కూడా నిరాశ పరిచింది. దీంతో పవన్ సినిమాతో కమర్షియల్ గా కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో కమర్షియల్ కథకు కావాల్సిన అన్ని అంశాలు మిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా కథ పవన్ కోసం రాసుకున్నది కాదట. మెగాహీరో వరుణ్ తేజ్ కోసం ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు క్రిష్.‘కంచె’ సినిమా తరువాత వరుణ్ తేజ్ తో మరో సినిమా చేయాలని భావించిన క్రిష్ ‘హరిహర వీరమల్లు’ కథను సిద్ధం చేశాడట. అయితే వరుణ్ మార్కెట్ కి.. ఈ సినిమా బడ్జెట్ సహకరించలేదట. వరుణ్ తేజ్ మార్కెట్ రేంజ్ కంటే రెండు, మూడింతలు సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుండడంతో ఈ కథను పక్కన పెట్టేశారట. చివరికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు.



























