Krishna roommate Chakradhar Rao : కృష్ణ గారు బుర్రిపాలెం నుండి మద్రాస్ వెళ్లి సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో రూమ్మేట్ గా ఉన్న చక్రధర రావు గారితో పరిచయం ఏర్పడి మంచి స్నేహితులు అయ్యారు. ఇక అమెరికా లో స్థిరస్పడిన చక్రధర రావు గారు కృష్ణ గారితో ఉన్న అనుబంధం గురించి అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆయన సినిమాలకోసం ఎంత కష్టపడేవారో వివరించారు. మనసు పెట్టి ప్రతి సినిమా చేసేవారంటూ చక్రధర్ రావు గారు కృష్ణ గారి గురించి చెప్పారు.

అల్లూరి సీతా రామరాజు కోసం చాలా కష్టపడ్డాడు…
కృష్ణ గారి సినిమా కెరీర్ లో మైలు రాయి వంటి సినిమా అల్లూరి సీతా రామరాజు. ఇక చక్రధర్ రావు గారు మాట్లాడుతూ కృష్ణ గారి అన్ని సినిమాల్లో బాగా నచ్చిన సినిమా అల్లూరి సీతా రామరాజు అంటూ చెప్పారు. ఆ సినిమాకోసం చాలా కష్టపడ్డారంటూ చెప్పారు. చాలా మంది సినిమా మొదలు పెట్టేటపుడు ఆయనను నిరుత్సాహపరిచారంటూ అయినా రిస్క్ చేసి ఆ సినిమా చేశారని చెప్పారు.

ఇక ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ను కృష్ణ పాత్రతో పోల్చకూడదు అంటూ చెప్పారు. కృష్ణ గారి పాత్ర రియాలిటీ కి దగ్గరగా ఉంది, రామ్ చరణ్ పాత్ర కల్పితం. రెండింటినీ పోల్చలేము అంటూ చెప్పారు. ఇక అల్లూరి పాత్ర కోసం కృష్ణ గారు మూడు నెలలు మన్యం ప్రాంతంలో ఉండి కష్టపడ్డారు అంటూ చెప్పారు. అంత కష్టపడ్డారు కాబట్టే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది అంటూ చెప్పారు.































