Krishna Vamsi : రాఖి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో చాలా స్పెషల్. ఆ సినిమాలో తన నటనకు వందకు వంద మార్కులు పడుతాయి. అమ్మాయిల ట్రాఫికింగ్ గురించి గృహ హింస గురించి సినిమాలో చూపించడం జరిగింది. కృష్ణ వంశీ టేకింగ్, ఎన్టీఆర్ యాక్షన్ తో సినిమా ఎమోషనల్ హిట్. అప్పటికి ఎన్టీఆర్ ఆహార్యం హీరోలా లేదు చాలా లావుగా తయారయ్యాడు, కానీ సినిమాలో తన నటనతో మాత్రం అందరినీ ఆకర్శించాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్ లాగా మరే హీరో నటించలేడని చాలా మంది అప్పట్లో అభిప్రాయపడ్డారు కూడా.

నటనలో నెంబర్ వన్ ఎన్టీఆర్…
కృష్ణ వంశీ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యాడు ఆ సినిమాతో ఆ తరువాత ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీస్తే రాఖి సినిమాలో ఎన్టీఆర్ సన్నివేశాలను నటనకు రిఫరెన్స్ గా చూపించేవారట. ఇక తాజాగా కృష్ణ వంశీ పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటూ తన పాత సినిమాల గురించిన విషయాలను చెబుతున్నారు. ఇక నటనలో ఏ యాక్టర్ కి మార్కులు ఇస్తారు అని అడుగగా, ఎన్టీఆర్ నటనలో నెంబర్ వన్ అని, పాత్రలో ఒదిగిపోతాడని, అతనితో సమానంగా నటించే మరో హీరో కేవలం మహేష్ అని, ఇక ప్రకాష్ రాజ్ నటన కుడా బాగుంటుందని చెప్పారు.

అయితే మనవాళ్ళు నటన అనగానే కేవలం హీరోలను మాత్రమే చూస్తారు అందుకే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులను చెప్పలేదు అంటూ ఎన్టీఆర్ నటన లో నెంబర్ వన్ అంటూ కితాబిచ్చారు. తాజాగా కృష్ణ వంశీ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ‘రంగ మార్తాండా’ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అనసూయ, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు నటించారు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.



























