Krishna Vamsi : రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా తొలి అడుగులేసిన కృష్ణ వంశీ ‘గులాబీ’ సినిమాతో డైరెక్టర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్న కృష్ణ వంశీ ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాను నాగార్జున తో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత తీసిన ‘సింధూరం’ సినిమాతో అవార్డులు అందుకున్నారు. ఇక ఆయన తీసిన ‘అంతఃపురం’ సినిమా మంచి హిట్ అయి హిందీ లో కూడా శక్తి పేరుతో ఆయనే మళ్ళీ తీశారు. హీరోయిన్ రమ్య కృష్ణ ను వివాహం చేసుకున్న ఆయన ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక ఆయన సినిమాల్లో ఏదో ఒక సామాజిక అంశాన్ని జోడించిండం ఆయన ప్రత్యేకత.

పాన్ ఇండియా సినిమా చేయక పోడానికి కారణం…
కృష్ణ వంశీ గారు చేసే సినిమాల కథలు, ఆయన తీసే తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అలాంటి డైరెక్టర్ ఎందుకని పాన్ ఇండియా సినిమా వైపు వెళ్లలేదు అనే ప్రశ్న ఇటీవల ఆయనకు ఎదురైంది. అదికాక ఆయన గురువు ఆర్జీవి బాలీవుడ్ లో అనేక సినిమాలను చేసారు. ఇక ఈయన కూడా శక్తి అనే సినిమాను హిందీ లో చేసారు మరి ఎందుకు ఆయన సినిమాను విస్తరించలేదనే ప్రశ్నకు కృష్ణ వంశీ చెబుతూ… అప్పట్లో సినిమా ఇన్ని భాషలలో తీయాలి మార్కెట్ పెంచుకోవాలి వంటి ఆలోచనలు లేవని, సినిమా నేను అనుకున్నట్లు వస్తోందా లేదా అన్నదే చూస్తానని చెప్పాడు. ఇక ముంబై లో రోజూ 12 కి మొదలవుతుంది చాలా ఆలస్యంగా, అది నాకు నచ్చలేదు. ఇక పూణే చాలా బిజీ నగరం చాలా ఇరుకుగా ఉంటుంది అక్కడ ఉండలేక పోయాను, ఇది నా ప్రపంచం కాదు అని అనిపించింది, అక్కడ సెట్ అవ్వలేదు. అందుకే వచ్చేసా. మా గురువు గారు పిలిచి సినిమా చేయమన్నారు కానీ నా వల్ల కాలేదు.

రాజమౌళి వంటి దర్శకులు పాన్ ఇండియా సినిమాలు చేయడం గురించి మాట్లాడుతూ, రాజమౌళి చాలా కష్టపడ్డాడు. తన సినిమాను ఎక్కడి దాకా తీసుకు వెళ్లాలో అంతదాకా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇక తనతో పాటు తన వెనుక ఉన్నవాళ్లు కూడా తనకు బలం. కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, శోభు యార్లగడ్డ, వల్లి అమ్మ, రాఘవేంద్ర రావు, వంటి వారు ఆయనకు బలం, ఆయనకు వెనుక నుండి పుష్ చేస్తారు. ఒక ఉమ్మడి కష్టంగా సినిమా తీసి విజయాన్ని అందుకుంటారు, అందుకే రాజమౌళి తన సినిమాలను హాలీవుడ్ వరకు తీసుకెళ్తున్నాడు అంటూ కృష్ణ వంశీ అభిప్రాయపడ్డారు.































