Krishnam Raju : తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్పగా కళాకారుడిని కోల్పోయింది. సీనియర్ నటుల్లో ఒకరైన కృష్ణం రాజుగారు మరణించి ఇండస్ట్రీ ని షాక్ కి గురిచేసారు. సెలబ్రిటీలందరూ ఆయనను చివరి సారిగా చూడడటానికి వచ్చి అయన అంత్యక్రియల్లో పాల్గొని ఘన నివాళి ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ లాంచనాలతో ఘన నివాళి ఇచ్చింది. ఇక కృష్ణం రాజు గారి చివరి చూపుకు బాలకృష్ణ, రాజమౌళి, నాగార్జున వంటి వారు రాకపోవడం వల్ల ఆది ఒక చర్చకు దారితీసింది. ఇక వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ మరో చర్చకు తెరలేపింది.

షూటింగులు బంద్ చేయలేరా…
కృష్ణం రాజుగారు గొప్ప నటులు అందులో ఎటువంటి సందేహం లేదు. అయన లేని లోటు ఇండస్ట్రీ కి తీర్చలేనిది. ఇక ఆయన ఒక లెజెండరీ నటుడు కనుకనే ఆయనను చూడటానికి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ కదిలొచ్చింది. అయితే బాలకృష్ణ తన 107 సినిమా షూటింగ్ కోసం టర్కిలో ఉండటం వల్ల అక్కడినుండి ఆయనకు నివాళులర్పిస్తూ వీడియోను విడుదల చేసారు. ఇక రాజమౌళి కూడా విదేశాల్లో ఉండటం వల్ల రాలేకపోయారు. ఇలా ఎవరికి వారు వాళ్ళ వ్యక్తిగత కారణాలతో రాలేదు. ఈవిషయాన్ని భూతద్ధంలో చూడటం అనవసరం.

ఇక రామ్ గోపాల్ వర్మ కృష్ణం రాజు గారి అంతటి లెజెండరీ నటుడు మరణించాడు రెండు రోజులు షూటింగులు బంద్ చేసుకోలేరా అంటూ ట్వీట్ చేసారు. ఇక ఈ ఉదంతం పై ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు మాట్లాడుతూ వర్మ ఏ విషయం అయినా వ్యతిరేకంగా మాటాడుతాడు ఆది మామూలే, ఆయన్ని పట్టించుకోవడం అందరూ మానేశారు. కృష్ణం రాజు గారికి ఘనంగా నివాళి ఇచ్చింది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక షూటింగులను బంద్ చేస్తే ఏమొస్తుంది దాని వల్ల రోజు వారి కూలీలు నష్టపోతారు అంతే. కాబట్టి ఏదో ఒక వివాదాన్ని లేపాలని చూడటమే తప్ప మరేమి కాదు అంటూ అభిప్రాయపడ్డారు.



























