Krishnam Raju : నిన్న తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కృష్ణం రాజు గారు తుది శ్వాస విడిచారు. ఆయన మరణించిన తరువాత ఆయన గురించిన ఎన్నో గొప్ప విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. రాజుల వంశంలో పుట్టడం కాదు కృష్ణం రాజు గారు నిజంగా రాజే అన్నట్లు గా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలను వల్ల కృష్ణం రాజు గారు మరణించారు. అయన కరోనా సోకిన తరువాత కిడ్నీ పనితీరు చెడిపోయింది. ఇక కరోనా నుండి కోలుకున్నాక కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన చాలా కాలం నుండి ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇక నిన్న ఉదయం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మొదటి భార్య సీతా దేవి కి ఇచ్చిన మాట…
అందరికీ తెలిసిన విషయమే కృష్ణం రాజుగారి మొదటి భార్య సీతా దేవి గారు యాక్సిడెంట్ లో అనుకోని విధంగా మరణించడంతో అయన ఒంటరి వాడైపోయారు. ఇక ఆయన ఒంటరితనంతో అలా క్రుంగిపోవడం ఇష్టంలేక ఆయన కుటుంబం ఆయనకు శ్యామల దేవి గారిని ఇచ్చి మళ్ళీ రెండో వివాహం చేసారు. రాజవంశంలో పుట్టిన వారికి పట్టింపులు ఆచారాలు ఎక్కువ అయితే సీతా దేవి గారు అన్నం తినే సమయంలో మొదటి ముద్ద దేవుడికి పక్కన పెట్టేవారట. ఇక సీతా దేవి గారు కృష్ణం రాజు గారి జీవితంలోకి వచ్చాక ఆయనకు కూడా ఆ అలవాటు అబ్బింది.

ఇక సీతా దేవి గారు మరణించినా కృష్ణం రాజుగారు ఆ అలవాటును మానలేదట. అయన తుది శ్వాస వదిలే వరకూ ఆయన ప్రతి రోజు తినే ముందు మొదటి ముద్ద ఆయన భార్య సీతాదేవికి పెడతారట. ఇది ఆయన మరణించే వరకూ పాటించారు. ఆయన జీవంచి ఉన్నంత వరకు రెండో భార్యను ఎంతో ప్రేమగా చూసుకున్నా మొదటి భార్య జ్ఞాపకాలను బాగా నెమరువెసుకునేవారట.
































