Krishnam Raju: సినిమాలలో రాణిస్తూ కేంద్ర మంత్రిగా సక్సెస్ అయిన కృష్ణంరాజు!

Krishnam Raju: టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన అనారోగ్య సమస్యల కారణంగా నేడు తుది విశ్వాస విడిచారు.అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నటువంటి కృష్ణంరాజు నేడు తెల్లవారుజామున కన్నుమూశారు.

ఇకపోతే ఈయన కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తన మార్క్ చూపించారు. రాజకీయాలలోకి వచ్చి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం గురించి ఇక్కడ తెలుసుకుందాం. కృష్ణంరాజు 1991 వ సంవత్సరంలో రాజకీయాలలోకి వచ్చారు. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈయన అదే ఏడాది నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతి రాజు విజయ్ కుమార్ రాజు అనే వ్యక్తి పై పోటీ చేసి ఓడిపోయారు.

ఈ విధంగా ఓడిపోవడంతో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన తిరిగి 1998లో బిజెపి పార్టీలో చేరారు. కాకినాడ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీకి దిగి విజయం సాధించారు.1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుంచి మళ్లీ పోటీ చేసి… కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు.

Krishnam Raju: మంచిగా బాధ్యతలు చేపట్టిన కృష్ణంరాజు..

అనంతరం ఈయన అటల్ బీహారీ వాజ్ పాయ్ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇక కొంతకాలం పాటు రాజకీయాలకు దూరమైనటువంటి ఈయన 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. అయితే ఈ పార్టీ కూడా గెలవకపోవడంతో ఈయన తిరిగి బీజేపీలో చేరారు. ఇలా బిజెపిలో కొనసాగుతున్నప్పటికీ ఎక్కడ రాజకీయాలలో చురుగ్గా పాల్గొనలేదు.