Krishnam Raju : ఒకప్పటి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు నాలుగు స్థంబాలుగా ఏళుతున్న రోజులలో కృష్ణంరాజు తనదైన గంబీరమైన నటనతో రెబల్ స్టార్ గా అభిమానులలో స్థానం సంపాదించుకున్నాడు. కృష్ణం రాజు కొన్ని అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 11 ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్థులైన సంగతి తెలిసిందే. ఈయన ఆఖరి చూపు కోసం సినీ రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. ఆయనకు ఆప్తుడు అయిన నిర్మాత చిట్టి బాబు కృష్ణంరాజు స్వగృహానికి చేరుకొని ఆయనకు నివాళులు అర్పించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

అపుడే వెళ్లి ఉంటే బ్రతికేవారేమో…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిట్టి బాబు కృష్ణం రాజు తో తన అనుబంధం గురించి ఆయన చావుకు గల కారణాలు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చివరిగా ఆయనను కొన్ని నెలల క్రితం కలిసాను అని చెప్పారు. ‘రాధే శ్యామ్’ సినిమా తరువాత నాకు ఫోన్ చేసి సినిమా ఎలా ఉంది అని అడిగితే వెళ్లి మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. అపుడే ఆయన నాతో కొంచం అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లండన్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారట, అయితే ఎందుకు ఆలస్యం వెంటనే వెళ్లొచ్చు కదా అని కూడా చెప్పాను అని కానీ ఇక్కడే కొన్ని టెస్టులు చేయించుకొని వెళ్తాను అని చెప్పారు, అపుడే వెళ్లి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు.

అసలు కృష్ణం రాజు గారికి ఏం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని ప్రశ్నించగా… ఆయనకు షుగర్ ఉంది, పైగా వయసు కూడా 83 సంవత్సరాలు కావడంతో హాస్పిటల్ లో చేరాక కిడ్నీలు రెండు ఫెయిల్ అవ్వడం తో ఆయన మరణించారు అని చెప్పుకొచ్చారు. ఆగష్టు 5 న చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరారు, చికిత్సలో ఉండగానే సెప్టెంబర్ 11 న ఆయన మరణించారు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ పది మందికి భోజనం పెడుతూ ఆయన తినే వారు, నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది, నన్ను చిట్టీ అని పిలిచేవారు, ఆయన మరణం ప్రభాస్ కు తీరని లోటు అని నిర్మాత చిట్టీ బాబు చెప్పుకొచ్చారు.
































