డార్లింగ్ ప్రభాస్.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అందరికీ తెలిసిందే.. బాహుబలి అందించిన సూపర్ క్రేజ్ తో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. కానీ ఎందుకో పెళ్లిపై అయన దృష్టి పెట్టడంలేదు. అయితే మీడియాలో మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ప్రభాస్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోతున్నాడు.

పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఎదో ఒకలా దాటవేస్తూనే ఉన్నాడు. అయితే తనకు పెళ్లి కాకపోవడానికి అమ్మాయిల విషయంలో తన లెక్కలు ఫెయిల్ అవ్వడమే అంటూ ఇటీవలే రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ప్రభాస్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ వ్యాఖ్యలు ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. ఈ నేపధ్యంలో మరోసారి ప్రభాస్ , అనుష్కల పెళ్లి తెరమీదికి వచ్చింది. అయితే.. తాజాగా ప్రభాస్ పెళ్లి పై ఆయన పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి స్పందించారు.

మిర్చి, బాహుబలి సినిమా చూసిన తరువాత ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకుంటే చూడాలనుకునే ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు.. అయితే సినిమాల వరకూ ఒకే కానీ.. ప్రభాస్, అనుష్క నిజంగానే మంచి ఫ్రెండ్స్. ఈ మాట మాత్రం ఎవరూ కాదనలేని వాస్తవం. ఇదివరకే పెళ్లి వార్తలపై ప్రభాస్, అనుష్క ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఈ విషయంపై కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి మాట్లాడుతూ.. ప్రభాస్, అనుష్కలు మంచి స్నేహితులని వారిద్దరి మధ్య ఇటువంటి ఉద్దేశ్యంలేదని.. వీరిపై వస్తున్నా వార్తలను ఖండించారు. ప్రభాస్ కి తెలుగు సాంప్రదాయాలు, కుటుంబం, పెద్దలు, మహిళలపై అమితమైన గౌరవం ఉంది.. కెరీర్, సినిమాలు అంటూ బిజీలో ఉండటం వల్ల కాస్త ఆలశ్యం అయిందని, కానీ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.. ప్రస్తుతం శ్యామలాదేవి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.































