రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ పూర్తి చేశాడు.. ఈ సినిమా తర్వాత సలార్ సినిమా చేస్తున్నాడు. రాధే శ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతుండడంతో అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. జులై 30 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సాహో తర్వాత ఆకలిగా ఉన్న ఫ్యాన్స్ కి రాధే శ్యామ్ సినిమా ఫుల్ మీల్స్ పెడుతుందని ఎదురుచూస్తున్నారు. పూజ హెగ్డే కథానాయిక గా నటిస్తున్న ఈ సినిమా లుక్స్ ఇప్పటికే మంచి స్పందన దక్కించుకుంటున్నాయి. శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయినా లుక్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది..
ఇక సలార్ సినిమా ఇటీవలే ఘనంగా ప్రారంభమవగా షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం.. ఇక ఈ సినిమా తో పాటే ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేయగా అందులో ఆదిపురుష్ సినిమా పనులు చకచకా జరుగుతున్నాయి..
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా తాజాగా సీత పాత్ర కు హీరోయిన్ ని ఫిక్స్ చేసింది చిత్ర బృందం.. ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై చాల పరిశీలనలు అయ్యాయి. సీత పాత్రలో కీర్తిసురేష్, అనుష్క,కృతిసనన్.. ఇలా చాలా మంది పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే కృతిసనన్‌నే సీత పాత్రకు చిత్ర యూనిట్ తీసుకుంది అని తెలుస్తుంది. అలాగే లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నాడు. ప్రభాస్, కృతిసనన్, సన్నీ సింగ్, డైరెక్టర్ ఓంరావుత్ కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో సీత పాత్రలో కృతి నటిస్తోందనే విషయం ఖరారైంది.



























