ఉప్పెన సినిమా తో ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టిన కృతి శెట్టి మరోసారి ప్రేక్షకుల అటెన్షన్ ని తనవైపు తిప్పుకుంది. కూచిపూడి చేసి తనలో ఉన్న మరో టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఉప్పెన సినిమా లో తన అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతిశెట్టి .. ఒక రొమాంటిక్ సాంగ్ లో రోమాన్స్ ని కళ్ళతోనే పంచి కుర్రకారు ను నిద్రపోనీయకుండా చేసింది..`ఉప్పెన` చిత్రంలో బేబమ్మగా తెలుగు ఆడియెన్స్ మనసులను దోచుకుంది కృతి శెట్టి. అందం, అంతకు మించిన అభినయం, మంత్రముగ్ధుల్ని చేసే హవభావాలతో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్‌ మారిపోయింది.

ఇక ఉప్పెన రిలీజ్ కాకముందే ఆమెపై దర్శక నిర్మాతల కన్ను పడింది. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా కృతి ని బుక్ చేసుకున్నారు.. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.. అందులో రెండు సూపర్ హిట్ అయినా స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. నాని , రామ్, సుధీర్ బాబు నటిస్తుండగా త్వరలో మహేష్ తో ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు.తాజాగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. తాను అద్భుతమైన నృత్యకారిణి అని నిరూపించుకుంది. కుచిపూడి నృత్యం చేసి అభిమానులను, నెటిజన్లని ఫిదా చేసింది.

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని విడుదల చేసిన `ఈశ్వర` వీడియో సాంగ్‌లో నృత్యం చేస్తూ కనువిందు చేసింది. ఈ వీడియో లో ఆమె ఇలా కనిపించేసరికి కృతి ఈ టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఉప్పెన సినిమాలోని ఈ పాటని చంద్రబోస్‌ రాయగా, దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసి ఆలపించారు.బెంచ్‌ మార్క్ డిజిటల్‌ దీన్ని రూపొందించగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ నిర్మించాయి. మొత్తంగా ఇది `ఉప్పెన` టీమ్‌ నుంచి వచ్చింది.ఇందులో కృతి శెట్టి అద్భుతమైన నృత్యంతో మైమరపింప చేసింది. ఆడియెన్స్ ని ఒలలాడించింది. మహాశివరాత్రి సందర్భంగా దీన్ని విడుదల చేయడం విశేషం.ఈ వీడియో సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here