కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఉప్పెన సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి హిట్ ని సాధించింది. వైష్ణవ్ హీరోగా నటించగా అయన నటిస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి..మెగా అభిమానులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నాడో ఆ అంచనాలను వైష్ణవ్ అందుకోగా తన యాక్టింగ్ తో అందరిని మెస్మరైజ్ చేశాడు. కృతి శెట్టి కూడా తన లేత అందాలతో, చక్కని అభినయంతో ప్రేక్షకులను అలరించింది.
ఈ సినిమా లోని తన నటన తో అందరి హృదయాలను కట్టిపడేసింది కృతి.. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది తనకి. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో కృతి శెట్టి తన రెండో సినిమాకు ఏకంగా 75లక్షలను డిమాండ్ చేస్తోందని టాక్. ఉప్పెన సినిమా విడుదలకు ముందు.. విడుదల తర్వాత కృతి శెట్టి గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. చూడ్డానికి ఎంతో చిన్న పిల్లలా కనిపించే ఈ అమ్మడు గురించి సోషల్ మీడియాలో ఎక్కువ మంది చర్చిస్తున్నారట.
ఇకపోతే దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు క్యూలు కడుతున్నారు. ఈమేరకు సూపర్‌స్టార్ మహేశ్ నెక్ట్స్ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుందని టాక్ గట్టిగానే వినిపిస్తుంది. ప్రస్తుతం మహేశ్ తన 27వ చిత్రం ‘సర్కారువారిపాట’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ సినిమా ఉంటుందనే వార్తలు వచ్చినా.. దర్శకధీరుడితో మహేశ్ సినిమా చేసే లోపు మరో సినిమాను ట్రాక్ ఎక్కించేలా ప్లాన్ చేసేశాడట.ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతిశెట్టి నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కృతిశెట్టి ఇప్పుడు నానితో శ్యామ్ సింగరాయ్, రామ్, లింగుస్వామి, సుధీర్ బాబు సినిమాలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు రిలీజ్ అయితే కృతి శెట్టి రేంజ్ మాములుగా ఉండదు మరీ..



























