మెగాస్టార్ చిరంజీవికి ఆ బిరుదు ఎవరిచ్చారో తెలుసా.?

0
303

చిరంజీవి మెగాస్టార్ కాకముందు సుప్రీం హీరో. సుప్రీం హీరోగా సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి అప్పటికే టాలీవుడ్ లోని అగ్రహీరోలైన NTR, ANR, కృష్ణ, శోభన్ బాబు లాంటి వాళ్లెంతమంది వున్నా తనదైన నటనా చాతుర్యం తో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని స్వయంకృషితో హీరోగా ఎదిగారు చిరంజీవి. అంతేకాకుండా.. వరుసగా సూపర్.. డూపర్ హిట్లతో దూసుకుపోతున్న మన సుప్రీం హీరోకు మెగాస్టార్ బిరుదైతేనే కరెక్ట్ గా సరిపోతుందని భావించారు ఓ టాలీవుడ్ బడా నిర్మాత.

అప్పటికే చిరంజీవితో చాలా సూపర్ హిట్ సినిమాలనందించిన ఆ నిర్మాతే చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ఇచ్చారు. దాంతో సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ గా మారిపోయాడు. ఇంతకీ ఆ నిర్మాత మరెవరో కాదు.. K.s. రామారావు. చిరంజీవితో తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో K.s రామారావు ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తీశారు. ఆరోజుల్లో అగ్రహీరోలుగా NTR, ANR, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలున్నా.. చిరంజీవితోనే ,K.s రామారావు అద్భుతమైన చిత్రాలను నిర్మించారు.

వీళ్లిద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘అభిలాష’. ఆ చిత్రాన్ని యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల ఆధారంగా తీశారు. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఆరోజుల్లో ‘అభిలాష’ చిత్రం టాలీవుడ్ లోనే టాప్ హిట్. ఆ తర్వాత ‘ఛాలెంజ్’ చిత్రాన్ని సేమ్ ఫార్మాట్ లో యండమూరి నవల ఆధారంగానే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తీశారు. ఈ చిత్రం కూడా బాక్సీఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత రాక్షసుడు, మరణ మృదంగం లాంటి చిత్రాలు యండమూరి నవల్స్ ఆధారంగానే వచ్చాయి. మరణ మృదంగం చిత్రం విడుదలైన సందర్భంగా నిర్మాత K.s రామారావు.. అప్పటివరకూ సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవిని ఒక్కసారిగా మెగాస్టార్ గా మార్చేశారు. ఆ విధంగా మన టాలీవుడ్ సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ చిరంజీవి అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here