మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరి బ్యాంకు ఖాతాల్లో రేపు (మంగళవారం, 14-04-2020) రూ.1500 లు జమవుతాయని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్లరేషన్ కార్డుల లబ్దిదారులకు 74 లక్షలు భ్యాంకు అకౌంట్లలో జమచేస్తామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1112 కోట్ల రూపాయిలను బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పారు. ఆయా బ్యాంకుల లబ్ధిదారులందరికీ రూ.1500 జమ అవుతాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు కేటీఆర్.

ఇప్పటికే రాష్ట్రంలో 87శాతం కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. మొత్తం 76 లక్షలమంది బియ్యం తీసుకున్నారని, ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యం చొప్పున అందిందని తెలిపారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరిగిందని వెల్లడించారు. తెలంగాణా పౌరసరఫరాల శాఖ ఈవిషయంలో అద్భుతంగా పని చేసిందని కొనియాడారు కేటీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here