కర్ణాటక కొత్త సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి భార్య రాధికా కుమారస్వామి హీరోయిన్ గా కన్నడ పరిశ్రమలో అందరికీ తెలుసు. ఆమె కొన్ని కన్నడ చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2006లో కుమారస్వామిని పెళ్లాడిన రాధికా కుమారస్వామి 2002లో నీల మేఘ శ్యామతో కన్నడ సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. కన్నడలో రాధిక 30కి పైగా సినిమాలలో నటించారు. ఆమె ప్రధాన పాత్రలో కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.

రాధిక రాజకీయాల్లోకి వస్తారని కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. కానీ ఆమె సుముఖంగా లేదని కూడా గతంలోనే టాక్ వినబడింది. రాధికా కుమారస్వామి చివరి చిత్రం ఈశ్వర్. కుమారస్వామికి 58 ఏళ్లు. అతని భార్య రాధికా కుమారస్వామికి 31 ఏళ్లు. 2005లో రాధికా – కుమారస్వామిలకు పరిచయమైంది. 2006లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత అంటే 2010లో అందరికీ వివాహం గురించి తెలిసింది. అటు రాధిక, ఇటు కుమారస్వామిది.. ఇద్దరిదీ రెండో వివాహమే. రాధిక 2000లో ఆమె రతన్ కుమార్ ను పెళ్లాడారు. అప్పటికి ఆమె వయస్సు పద్నాలుగు. రెండేళ్లకు రతన్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అతను 2002లో మరణించాడు. కుమారస్వామి 1986లో అనితను వివాహం చేసుకున్నారు. తమిళ సినిమాల్లోను రాధిక ప్రతిభ చూపారు.

ఇక ప్రస్తుత విషయానికొస్తే.. కుమారస్వామి కర్ణాటక సీఎం అవుతున్న నేపథ్యంలో అందరూ ఆయన గురించి సెర్చ్ చేస్తున్నారు. సెర్చింగ్ సమయంలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఆ రోజుల్లోనే రాధికా కుమారస్వామి కర్ణాటక కొత్త సీఎం కుమారస్వామి భార్య కావడంతో గూగుల్ సెర్చింగ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వ్యక్తిగా నిలిచారు. సినీ నిర్మాత స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగిన కుమారస్వామి… నటి రాధికను పెళ్లి చేసుకున్న తర్వాతనే కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాధికా కుమారస్వామి ఫ్యామిలీ ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా రాధికా కుమారస్వామి ఓ యూట్యూబ్ ఛానెల్ భారీ షాక్ ఇచ్చింది. ఆమె నటించిన ఓ చిత్రాన్ని ఆమె పర్మిషన్ లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. ఈ సంగతి తెలుసుకున్న రాధిక ఆ చిత్రాన్ని అప్ లోడ్ చేసిన యూట్యూబ్ ఛానెల్ పై లీగల్‌గానే చర్యలు తీసుకోబోతున్నట్టు తెలియజేసింది. గతంలో రాధిక కుమారస్వామి ‘స్వీటీ నాన్న జోడి” అనే చిత్రాన్ని తెరకెక్కించారు. 2013లో ఈ చిత్రం థియేటర్‌లో విడులైంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. కానీ డిజిటల్ రైట్స్ మాత్రం రాధిక కుమార స్వామి దగ్గరే ఉండటంతో రూ. 3 కోట్ల రూపాయలతో నిర్మించిన ‘స్వీటీ నాన్న జోడి” చిత్రాన్నిరాధిక కుమారస్వామి అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చెయ్యడంతో ఇప్పుడామె ఇదే అంశాన్ని ఛీటింగ్ కేసు కింద ఫైల్ చేస్తూ బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ కేసు విషయమై పోలీసులు రాధిక కంప్లైంట్ ను నమోదు చేసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.



























