నటి కుష్బూ ఇటు తెలుగులోనూ అటు తమిళ్‌లోనూ 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. మంచి నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ డైరెక్టర్ సుందర్‌ని ప్రేమించి వివాహం చేసుకుంది కుష్బూ. వీరికి ఇద్దరు కుమార్తెలు అవంతిక, అనంతిక. కుష్బూ ముందు బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక బాలీవుడ్‌లో బాలతారగా ఓ వెలుగు వెలిగింది. హీరోయిన్‌గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నార్త్ ఇండియన్ కానీ తమిళ చిత్రాలతో టాప్ హీరోయిన్ అయింది. వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కెప్టెన్ నాగార్జున, పేకాట పాపారావు లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తరువాత రజనీకాంత్, ప్రభు కలిసి నటించిన చిత్రంతో తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే మంచి హిట్ కొట్టడంతో ఆమె కోలీవుడ్‌లో మంచి పేరు సంపాదించింది.

అప్పట్లో తమిళ సూపర్‌స్టార్స్ అయిన హీరోలందరితో నటించి మెప్పించి తమిళ తంబీలకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈమెకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే తమిళనాడులో ఆమెకు ఫ్యాన్స్ ఒక గుడి కూడా కట్టేశారు. ఇక కుష్బూ, ప్రభు కొన్నాళ్ళ పాటు ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే వీరి పెద్దలు వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించలేదు.

ఇక ఇదిలా ఉంటే… సోషల్ మీడియాతో ఎంతో యాక్టివ్‌గా ఉండే కుష్బూ ఎప్పటికప్పుడు అభిమానులతో తన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే గతంలో తన పిల్లలు ఫొటోలు షేర్ చేస్తున్నప్పుడు కుష్బూ చిన్నమ్మాయి అనందితాని చూసి షాకయ్యారు అంతా… అస్సలు కుష్బూలానే లేదంటూ చాలా నెగిటివ్ కామెంట్స్ ఆమె పై వచ్చాయి. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల చాలా నెగిటివ్ కామెంట్స్ చేయడంతో కుష్బూ వారందరికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది.

అయితే గత కొంత కాలంలా వారందరి ఫొటోస్‌ని షేర్ చేయడం ఆపేసింది. అయితే ఇటీవలె అనందితకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారాయి. ఇప్పుడు ఆమెను చూసిన వారు ఆమె ట్రాన్స్‌పర్‌మేషన్‌ని చూసి షాక్ అవుతున్నారు. అసలు అప్పటి అనందితకి ఇప్పటికి అసలు చాలా చేంజ్ ఉంది అన్నట్లు ఉంది అనందిత రూపం. అయితే తను ఎలా ట్రాన్స్‌ఫర్‌మేషన్ అయిందో తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్‌గానే అనందిత అనిల్‌సుందర్ అనే ఓ యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేసింది. ఇక రాబోయే వీడియోస్‌లో ఆమె తన ట్రాన్స్‌ఫర్‌మేషన్ గురించి షేర్ చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.

































