Kutty Padmini : పాత సినిమా లేతమనసులు లో పప్పి, లల్లి పాత్రలతో అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…” పిల్లలు దేవుడు చల్లని వారే ” సాంగ్ వినగానే టక్కున గుర్తొచ్చే ఆ పాప కుట్టి పద్మిని. తమిళనాడుకు చెందిన ఈ నటి తెలుగు, కన్నడ, మలయాళం, ఇలా అన్ని భాషలలోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన మూడవ ఏటనే సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో సక్సెస్ అయినా హీరోయిన్ గా మాత్రం పెద్దగా రానించలేక పోయారు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళనాడు నుండి అలాగే ఆంధ్ర నుండి ఎన్నో అవార్డులను అందుకున్న ఆమె నాటిగా కొనసాగుతూనే నిర్మాతగాను పలు సినిమాలను సీరియల్స్ ను నిర్మించారు.

మహేష్ ను ఆడించేదాన్ని…
కుట్టి పద్మిని గారు ఆనాటి రోజులు, నటీనటుల మధ్య అనుబంధాల గురించి మాట్లాడుతూ కృష్ణ గారు అలాగే విజయం నిర్మల గారితో ఉన్న అనుబంధం గురించి వివరించారు. చెన్నైలో కృష్ణ గారి ఇల్లు మా ఇల్లు రెండు ఇళ్ల గ్యాప్ తో ఉండేవి. అలా రోజూ వాళ్లయింటికి వెళ్లేదాన్ని అంటూ చెప్పారు. కృష్ణ గారు రియల్ జెంటిల్ మెన్ అంటూ చెబుతూ మహేష్ బాబు చాలా చిన్న పిల్లవాడు నేను అసలు వదిలేదాన్ని కాదు, కింద పెట్టేదాన్ని కాదు అంటూ చెప్పారు. మహేష్ చిన్నపుడు చాలా ముద్దుగా ఉండేవాడు చాలా తెల్లగా పింక్ కలర్ లో ముద్దుగా ఉండేవాడు.

ఎపుడూ ఎత్తుకుని ఆడించేదాన్ని కింద పెడితే చిన్న పాదాలు ఏమవుతాయో అనేలా ఎత్తుకునే దాన్ని, ఒక ఏడాది వరకు అలా వాళ్ళింటికి వెళ్లి మహేష్ ను ఎత్తుకుని ఆడుకునేదాన్ని అంటూ చెప్పారు. ఇక కృష్ణ విజయ నిర్మల గారిని నాలుగేళ్ళ క్రితం కలిసానని ఎంతో ఆప్యాయంగా మాట్లాడించారని, వారిద్దరూ ఇపుడకలేకపోవడం బాధగా ఉందంటూ చెప్పారు. కృష్ణ గారికి విజయనిర్మల గారింటే ఎంతో ప్రేమ, అలా ప్రేమించే భర్త దొరకడం నిజంగా అదృష్టం అంటూ చెప్పారు.































