సాధారణంగా మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే మధుమేహంతో బాధపడే వారు కొన్ని రకాల కాయగూరలను తినడం వల్ల వారి శరీరంలో చక్కెర స్థాయిలు అధికమవుతాయని భావిస్తారు. అయితే మధుమేహ సమస్యతో బాధపడే వారు బెండకాయలను తినవచ్చా? బెండకాయలను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం…

మధుమేహ సమస్యతో బాధపడే వారు నిరభ్యంతరంగా బెండకాయలను తినవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో దాగి ఉన్న ఎన్నో పోషకాలు విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలో ఉండేటటువంటి ఒలియానోలిక్ ఆమ్లం, బీటా సిస్టోస్టెనాల్, కెంప్ఫెరోల్ సమ్మేళనాలు మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడానికి దోహదపడుతుంది.
బెండకాయలను పచ్చిగా లేదా కూరలుచేసి తినడమే కాకుండా బెండకాయల తొక్కను వాటిలో ఉన్నటువంటి గింజలను ఎండబెట్టి ఆహారంలో కలుపుకుని తినడం వల్ల కూడా మన శరీరంలో చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. బెండకాయలో పూర్తిగా కరిగే, కరగని ఫైబర్ లో ఉండటం వల్ల ఇవి షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి కీలక పాత్ర వహిస్తాయి.
బెండకాయలో అధికభాగం ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.ఇవి కేవలం షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచడం కాకుండా ఇతర వ్యాధుల బారి నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి. బెండకాయలో ఉండే మైరిసెటిన్ కేవలం బ్లడ్ షుగర్స్‌ను తగ్గించడమే కాకుండా క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గించడంలో దోహద పడుతుంది.కనుక మధుమేహంతో బాధపడే వారు బెండకాయలను నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు




























