Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య గా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందు తరచూ ఎన్టీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. మొన్నా మధ్య జగన్ నాకు జీవితాన్ని ఇచ్చాడు అంటూ ఎన్టీఆర్ వర్ధంతి నాడు మాట్లాడిన లక్ష్మి పార్వతి గారు మరోసారి లోకేష్ పాదయాత్ర గురించి కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇంటర్వ్యూతో కనిపిస్తున్నారు. తాజాగా ఆమె సీనియర్ ఎన్టీఆర్ తో ఆమె మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఎన్టీఆర్ గారికి ముద్దు వస్తే ఏమని పిలుస్తారంటే…
సీనియర్ ఎన్టీఆర్ గారిని రెండో వివాహం చేసుకున్నాక ఎన్టీఆర్ గారు కుటుంబాన్ని దూరంగా ఉంచారు. ఎన్టీఆర్ గారి ఆత్మకథ రాయడానికి వచ్చి ఆయన అభిమానం చూరగొన్న లక్ష్మి పార్వతి ఆ తరువాత ఆయనను వివాహం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ గారు పార్టీ ప్రచారాలకు ఎక్కడికి వెళ్లినా లక్ష్మి పార్వతిని వెంట తీసుకుని వెళ్ళవారట.

అలా ప్రచారం చేసి అఖండ మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారు లక్ష్మి పార్వతికి గెలుపులో భాగం ఇస్తూ ఏదైనా పదవి తీసుకోమని చెప్పారట. అయితే లక్ష్మి పార్వతి గారు మాత్రం పదవులు ఆశించలేదట. ఇక ఎన్టీఆర్ గారు నీకు తెలివితేటలు లేదు అంటూ తిట్టేవారట. అలానే బాగా ముద్దు వస్తే ‘మేరె యార్’ అంటూ మాట్లాడుతారని అలాగే కోపం వచ్చినా ఒక తిట్టు తిడతారని లక్ష్మి పార్వతి ఆమె జ్ఞాపకాలను పంచుకున్నారు.






























