సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ల మధ్య అఫైర్స్ చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. హీరోయిన్ లక్ష్మి రాయ్ పరిచయం అవసరం లేని పేరు.. ఈ భామ సినిమాలో కంటే అఫైర్స్ తోనే ఎక్కువ ఫేమస్. సినిమాలో ఎంట్రీ ఇచ్చిన రోజు నుండి ఎక్కువగా కాంట్రవర్సీలతో ఉాండడం విశేషం. అందుకే లక్ష్మి రాయ్ అంటే కాంట్రవర్సీ క్వీన్ అంటారు. తనపై వచ్చిన రూమర్స్ పై కూడా పెద్దగా స్పందించని ఈ ముద్దు గుమ్మ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ తనపై వస్తున్న తప్పుడు ప్రచారానికి తెర దించడానికి ట్విట్టర్ లో గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే ఈ మధ్య లక్మి రాయ్ గర్భవతి అయింది అనే వార్తలు జోరుగా వినిపించాయి.. అయితే ఇప్పుడు ఈ వార్తలపై స్పందించింది ఈ బోల్డ్ హీరోయిన్. తాజాగా తాను గర్భవతి అని వస్తున్న అసత్య ప్రచారంపై లక్ష్మి రాయ్ మండి పడింది. ఇష్టం వచ్చినట్లు తప్పుడు వార్తలు రాస్తే నేను స్పందించను అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.

“ఎందుకు ఇలా నామీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అవును నాకు చాలా మందితో రిలేషన్ ఉంది, లవ్ ఎఫైర్స్ కూడా ఉన్నాయి. బ్రేక్ అప్ కూడా జరిగింది. మూడు సార్లు ప్రేమ లో పడి మోసపోయాను. కానీ ప్రస్తుతానికి నాదృష్టి అంతా సినిమాల మీదే పెట్టాను..” అని చెప్పుకొచ్చింది. ఇక కెరీర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. అస్సలు పక్క దారి పట్టను. నేను సినిమా లోకి రావడానికి పెద్దగా కష్ట పడలేదు, అవకాశాలు అవే వచ్చాయి. కానీ కొన్ని రూమర్స్ మరియు ఇతరుల ప్రభావం వల్లనే తన కెరీర్ నాశనం అయ్యింది అని చెప్పుకొచ్చింది. తనకు కొంత మంది హీరోలతో ఎఫైర్స్ ఉన్నవి నిజమే అయినా ఏదోక రోజు నా కోసం ఒక మంచి వ్యక్తి వస్తాడని ఎదురు చూస్తున్న అని చెప్పింది లక్ష్మి రాయ్.
































