మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మరువక ముందే అయన కుమారుడిపై కూడా అదే తరహా పిర్యాదులు అందుతున్నాయి. ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మండలం, రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి సీఎంకు ఫిర్యాదుతో కూడిన దరఖాస్తు చేశారు.

తనకందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఎసిబి విజిలెన్స్ శాఖ, రెవెన్యూ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం ఆదేశించారు.
































