మనిషికి డబ్బు ఎంత అవసరమో.. ఆరోగ్యం కూడా అంతే అవసరం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే.. మానవుడు డబ్బు వెనకాల పరుగెడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఫలితంగా సంపాదించిన డబ్బు అంతా రోగాలకు పెడుతున్నాడు. ఇలా ప్రస్తతం ప్రతీ వ్యక్తి జీవితంలో ఇలానే జరుగుతుంది. అయితే కొంతమంది పనుల్లో బిజీగా ఉండి రాత్రి వేళ సమయానికి అన్నం తినరు.
రాత్రి 8 గంటల సమయంలో తినాల్సింది.. 10 గంటల సమయంలో తింటాడు. ఇలా నిద్రపోయే సమయానికి కంటే ముందే 3 గంటల ముందు తింటే మంచిదని ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. అలా తింటేనే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాగలదు. లేదంటే అనేక అనర్థాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఉబకాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ప్రకారం.. నిద్రవేళలో ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపింది.
దీంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధన ప్రకారం.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అధిక బీపీ, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపింది. కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనలో నిద్రవేళలో ఆహారం తిన్న ఎలుకల జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావితం చూపాయంట.
అలాగే నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని కనుగొన్నారు. ఈ ఎలుకలలో జ్ఞాపకశక్తి కోసం ఏర్పడే అణువులు చాలా ప్రభావితమయ్యాయంట. ఇంకా జీవక్రియ మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రకమైన వ్యాధుల శరీరంపై దాడి చేసే ప్రమాదం ఉంటుంది. కనుక డిన్నర్ ను సమయానికి చేయాలి.. లేదంటే పైన చెప్పిన అనర్థాలు తప్పవు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…