Lavanya Tripati: నటి లావణ్య త్రిపాటి మరి కొద్ది రోజులలో మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ ను గత కొంతకాలంగా ప్రేమిస్తూ ఉన్నారు. అయితే వీరి ప్రేమ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచినటువంటి లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతూ ఇద్దరు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.

ఈ విధంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మరి కొద్ది రోజులలో ఈ జంట పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇక త్వరలోనే పెళ్ళికానున్న నేపథ్యంలో వీరిద్దరూ కూడా తమ సినిమా పనులలో బిజీ అయ్యారు.ఒకవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూనే మరోవైపు వారికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
నటి లావణ్య త్రిపాఠి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫోన్ వాల్ పేపర్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఇది వైరల్ అయింది. అయితే ఇందులో తన కాబోయే భర్త ఫోటో ఉండడం విశేషం.

Lavanya Tripati: వరుణ్ ఫోటో పెట్టిన లావణ్య…
లావణ్య త్రిపాఠి తన కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలు గ్యాదర్ చేసి వాల్ పిక్ గా మార్చారు. అయితే ఇందులో ఈమె వరుణ్ తేజ్ తో కలిసి ఒక వెకేషన్ లో పాల్గొన్నటువంటి ఫోటోని కూడా పెట్టారు. దీంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి ఎంతోమంది అభిమానులు వరుణ్ తేజ్ అంటే లావణ్య కు ఎంత ప్రేమ ఉంది ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.






























