Lavanya Tripati: సినీనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజులలో మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ఈ విషయాన్ని చాలా రహస్యంగా దాచారు .అయితే వీరి ప్రేమ విషయాన్ని బయట పెడుతూ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నప్పటికీ వివాహం మాత్రం చాలా ఘనంగా జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పనులను మొదలుపెట్టారని తెలుస్తుంది.ఇలా ఒకవైపు పెళ్లి పనులు జరుగుతూ ఉండగా మరోవైపు లావణ్య త్రిపాఠి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నారంటూ వార్త వైరల్ గా మారింది.
ఇలా లావణ్య త్రిపాఠి బాధపడుతున్నటువంటి వ్యాధి గురించి ఆమె స్వయంగా తెలియజేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. ఇలా లావణ్య త్రిపాఠి వ్యాధితో బాధపడుతుందన్న విషయం తెలిసి కూడా పెళ్లికి ఒప్పుకున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి లావణ్య త్రిపాఠి బాధపడుతున్నటువంటి వ్యాధి ఏంటి అనే విషయానికి వస్తే…

Lavanya Tripati: లావణ్య అలాంటి వ్యాధితో బాధపడుతున్నారా…
గత కొంతకాలంగా ఈమె ఏదైనా వస్తువులను చూసిన లేదా ఆకారాలను చూసిన తనకు తెలియకుండానే ఎంతో భయపడుతోందని అయితే ఈ విషయం గురించి డాక్టర్ ను సంప్రదించగా తాను ట్రీఫోఫోబియా అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపినట్లు తెలియజేశారు. ఇలా ఈమె ఈ వ్యాధితో బాధపడుతున్నారన్న విషయం తెలియడంతో ఒకసారిగా అభిమానుల షాక్ అవుతున్నారు.






























