బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో అనే పేరుతో పాటు అత్యంత వివాదాస్పద షో అని కూడా బిగ్ బాస్ షోకు పేరుంది. చాలామందికి బిగ్ బాస్ కాన్సెప్ట్ అస్సలు నచ్చదు. ఒకే హౌస్ లో తెలియని మేల్ కంటెస్టెంట్లు, ఫిమేల్ కంటెస్టెంట్లు ఎలా ఉంటారని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ షోలో పాల్గొని బయటకు వచ్చిన తరువాత ఎందుకు ఈ షోలో పాల్గొన్నామా..? అని తల పట్టుకునే వాళ్లు చాలామంది ఉన్నారు.  

కొందరు ఈ షో ద్వారా పాపులర్ అయితే కొందరు ఈ షో ద్వారా తమ ఇమేజ్ డ్యామేజ్ అయిందని చెబుతూ ఉంటారు. గతంలో అనేక వివాదాలతో బిగ్ బాస్ షో పాపులరైంది. తాజాగా తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. బిగ్ బాస్ షోపై ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లలో చర్చ జరుగుతోంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన లక్ష్మీ మీనన్ కు హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉంది.  

అజిత్ హీరోగా నటించిన విశ్వాసం, ఇతర సినిమాలు లక్ష్మీ మీనన్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. త్వరలో తమిళ బిగ్ బాస్ షో ప్రారంభం అవుతున్న నేపథ్యంలో లక్ష్మి మీనన్ ఈ షోలో పాల్గొనబోతుంతుంటూ వార్తలు వచ్చాయి. కమల్ హాసన్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనబోతుందంటూ వచ్చిన వార్తలపై లక్ష్మీ మీనన్ ఘాటుగా స్పందించారు.  

తాను బిగ్ బాస్ షోలో పాల్గొననని.. తనకు ప్లేట్స్ కడగటం, ఇతరులు వాడిన మరుగుదొడ్లు శుభ్రం చేయడం లాంటి పనులు నచ్చవని, కెమెరాల ముందు కొట్టుకోవడం తనకు నచ్చదని.. అలాంటి షిట్ షోలో పాల్గొనాలని తాను అనుకోవడం లేదని చెప్పారు. లక్ష్మీ మీనన్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె కామెంట్ల గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here