Extramarital Affair: మానవత్వం మంటకలిసిపోతోంది. క్షణకాల సుఖం కోసం వావీవరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. అక్రమ సంబంధాలతో పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. సొంత వాళ్లనే చంపుతూ బరి తెగిస్తున్నారు కొంతమంది.

తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని.. సొంత కూతురునే కన్న తల్లి హత్య చేసింది. తన మరిదితో సంబంధం పెట్టుకుంది. ఆ తరువాత మరో వ్యక్తిని మూదో వివాహం చేసుకుంది ఓ దుర్మార్గురాలు. తమ ఆనందానికి, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని చివరకు కడతేర్చి కటకటాలపాలైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే తమిళనాడు తూత్తుకూడికి చెందిన ఓ మహిళకు వివాహమై కూతురు కూడా ఉంది. తన కూతురును వదిలి మరిదితో ముంబైకి పారిపోయింది ఆ మహిళ. అయితే అక్కడ వీరిద్దరికి ఓ కూతురు పుట్టింది. ఆతరువాత మరిది ఆమెను వదిలిపారిపోయాడు.
మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం..
ఇదిలా ఉంటే తన కూతురుతో చెన్నైకి వచ్చి.. అక్కడ ఓ లారీ డ్రైవర్ ను మూడో పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరికి ఓ కుమారుడు, కూతురు పుట్టారు. కొద్ది రోజుల తర్వాాత మూడో భర్తకు అనుమానం రావడంతో గొడవలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే భర్తతో ఆదివారం గొడవపడింది. అతడు చెప్పాడని నిద్రలో ఉన్న రెండో భర్తకు పుట్టిన బిడ్డపై కిరోసిన్ పోసి తగలబెట్టింది. ఆ తరువాత మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం చేసింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న ఆ బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న సందర్భంలో ఆమె మూడు పెళ్లిళ్ల బాగోతం బయటపడింది. దీంతో ఆమెను, మూడో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.




























