Leonardo Dicaprio : రాజకీయనాయకులు సినిమా సెలబ్రిటీలు వీరికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే వీరు ఏమి చేసిన ఏమి మాట్లాడిన ఇట్టే జనాల్లోకి వెళిపోతుంది. ఇక మన దేశంలో అయితే సినిమా తారలతో ఎన్నికల ప్రచారం మాములే. ఇక సినిమా హీరోలు ఏమి మాట్లాడిన జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ సోషల్ మీడియా జమానాలో అది ఇంకొంచం ఎక్కువ. సినిమా తారలు ఏమి మాట్లాడిన అది ఇట్టే వైరల్ అవుతుంది. కొన్నిసార్లు ప్రభుత్వాలపై చేసే విమర్శలైన ప్రశంసలైన ఆ ప్రభుత్వం పై ప్రభావం చూపుతాయి. అలాంటి ఘటనే ఇపుడు జరిగింది.

లియోనార్డో ను నోరు అదుపులో పెట్టుకో అన్న బ్రెజిల్ అధ్యక్షుడు….
ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణంకు సంబంధించిన విషయాలపై హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. అమెజాన్ అడవులు ఈ భూ గ్రహంపై ఆక్సిజన్ ను అందించే వనరులు అలాంటి అమెజాన్ అడవులు వాతావరణ కాలుష్యం ఇతర కారణాల వాళ్ళ క్షీణించిపోతున్న తరుణంలో తాజాగా అమెజాన్ అడవులకు సంబంధించి డికాప్రియో చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఏకంగా ఆ ట్వీట్ బ్రెజిల్ అధ్యక్షుడికి కోపం తెప్పించింది. అమెజాన్ అడవులు క్షీణించిపోతున్న తరుణంలో పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని, భూ గ్రహాన్ని సురక్షితంగా ఉంచుకోవడంలో భాగంగా జరిగే మార్పుకు యువత ఓటింగ్ లో పాల్గొనడం ఎంతో కీలకమన్నారు. అమెజాన్ అడవులు, వాతావరణ మార్పులకు, ఇతర పర్యావరణానికి హాని జరిగే ఘటనలకు బ్రెజిల్ నిలయం అని డికాప్రియో ట్వీట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకుని పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలని బ్రెజిల్ యువతకు పిలుపునిచ్చారు.
Brazil is home to the Amazon and other ecosystems critical to climate change.
— Leonardo DiCaprio (@LeoDiCaprio) April 28, 2022
What happens there matters to us all and youth voting is key in driving change for a healthy planet. For more on voter registration in Brazil before May 4, visit https://t.co/0mKrfxLdRR #tiraotitulohoje
– Thanks for your support, Leo! It’s really important to have every Brazilian voting in the coming elections. Our people will decide if they want to keep our sovereignty on the Amazon or to be ruled by crooks who serve foreign special interest. Good job in The Revenant! ???? https://t.co/kg3b6rmPCw
— Jair M. Bolsonaro (@jairbolsonaro) April 29, 2022
దీనికి స్పందించిన ప్రస్తుత బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఓటు హక్కు వినియోగం గురించి లియోనార్డో యువతకు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో అమెజాన్ అడవులపై డికాప్రియో చేసిన వ్యాఖ్యలపై బోల్సోనారో కోపగించుకున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటు గా రిప్లై ఇచ్చారు. అమెజాన్ కార్చిచ్చుకు సంబంధించి 2019లో లియోనార్డో చేసిన పోస్టు కూడా కరెక్ట్ కాదన్నారు. 2003లో చోటు చేసుకున్న అమెజాన్ అడవుల ఘటనకు సంబంధించి పోస్టులు పెట్టడాన్ని అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అభ్యంతరం వ్యక్తం చేసారు.































