లాక్ డౌన్ సమయంలో ఎల్ఐసి ప్రీమియం చెల్లింపుదారులకు ఊరటనిచ్చే విధంగా LIC కీలక ప్రకటన !!

0
284

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మన దేశంలో కూడా కరోనా పంజా విసురుతోంది ఈ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఈ ప్రభావంతో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. ప్రజలు ఇళ్లకే ప్రమితమయ్యారు.

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొన్న సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కీలక ప్రకటన చేసింది. మార్చి 2020, ఏప్రిల్ 2020 లలో చెల్లించవలసిన ప్రీమియం చెల్లింపుల కోసం మరో 30రోజుల గడువు పెంచింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ప్రజలు ఆర్ధికంగా ఇబ్బడిపడుతున్న పరిస్థితి. ఇటువంటి సమయంలో ఎల్ఐసి ప్రీమియం చెల్లించాలా వద్దా అని ఆందోళనలో ఉన్న వినియోగదారుల కోసం ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here